Ustaad Bhagat Singh Trailer:భగత్ సింగ్ ధమ్కీ-ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌-పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్-రికార్డులు షేక్

Ustaad Bhagat Singh Trailer: ఆ డైలాగ్ లు, ఆ యాక్షన్.. అబ్బబ్బో అదుర్స్.. ఇదే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ పై వినిపిస్తున్న రియాక్షన్లు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది.

Published on: Mar 14, 2026, 18:31:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబో అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో వీళ్ల కాంబినేషన్ సూపర్ హిట్ అని నిరూపించుకుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. ఇవాళ రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/MythriOfficial)
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/MythriOfficial)

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ఇవాళ (మార్చి 14) రిలీజైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడిక ట్రైలర్ తో ఆ హైప్ పీక్స్ కు వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

పవర్ ఫుల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాకీ చొక్కా వేసి, పోలీసు క్యారెక్టర్ లో నడిచొస్తే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. ఇప్పుడు మరోసారి ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించనున్నాడు. ఆయన స్టైల్లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్, చేసిన యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ వేరే లెవల్ లో ఉందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇచ్చిపడేసే గోత్రం

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ లో పవన్ ఇరగదీశాడు. మధ్యలో శ్రీలీలతో లవ్ ట్రాక్ కూడా కుదిరింది. ‘‘భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పవన్ డ్యాన్స్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇందులో అదిరే ట్రీట్ ఉండబోతుంది. ఇక ‘‘ఈ సారి ఫర్సార్మెన్స్ అదిరిపోద్ది’’ అనే డైలాగ్ తో ట్రైలర్ ను ఎండ్ చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్

ఉగాది సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్లకు రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ బీజీఎం అందించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం (మార్చి 15) నిర్వహించనున్నారు.

ధురంధర్ 2తో ఢీ

బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2తో ఉస్తాద్ భగత్ సింగ్ పోటీపడనుంది. రణ్ వీర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2 కూడా మార్చి 19న రిలీజ్ అవుతుంది. తెలుగులోనూ థియేటర్లకు రాబోతుంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేయాలని ముందు ఫిక్స్ అయ్యారు. కానీ టాక్సిక్ వాయిదా కారణంగా మార్చి 19కి ప్రీపోన్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More