షారుఖ్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్.. కోట్లాది రూపాయల ఆఫర్లు వదులుకున్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రేంజ్ ఆఫర్లు వచ్చినా కూడా పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. దానికి గల బలమైన కారణాన్ని తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ వెల్లడించారు.

Published on: Feb 23, 2026, 13:34:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90వ దశకంలోనే ఆయన స్టార్‌డమ్ మొదలైనా, 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.

షారుఖ్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్.. కోట్లాది రూపాయల ఆఫర్లు వదులుకున్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?
షారుఖ్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్.. కోట్లాది రూపాయల ఆఫర్లు వదులుకున్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

జాతీయ స్థాయిలో ఆఫర్లు

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో భారీ ఆఫర్లు వచ్చాయన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లాంచ్

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా ఫిబ్రవరి 22న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

షారుఖ్ ఖాన్ రేంజ్ ఆఫర్లు.. కానీ!

"పవన్ కల్యాణ్ డబ్బుకు లొంగే వ్యక్తి కాదు. ఇది నా వ్యక్తిగత అనుభవం. గబ్బర్ సింగ్ తర్వాత అప్పట్లో 'పాన్ ఇండియా' అనే పదం లేకపోయినా.. పవన్ కల్యాణ్‌కు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. అనేక వాణిజ్య ప్రకటనలు (యాడ్స్), భారీ ప్రాజెక్టుల ఆఫర్లు ఆయన తలుపు తట్టాయి" అని హరీష్ శంకర్ వెల్లడించారు.

ఆరోగ్యమే ముఖ్యం.. పిల్లల కోసం ఆ నిర్ణయం

కోట్లాది రూపాయల ఆఫర్లను పవన్ కల్యాణ్ ఎందుకు వదులుకున్నారో కూడా హరీష్ శంకర్ వివరించారు. "కొన్ని ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావని, ముఖ్యంగా పిల్లలపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని పవన్ కల్యాణ్ గారు భావించారు. ఆ యాడ్స్‌కు నేనే దర్శకత్వం వహించాల్సి ఉన్నా, కోట్లు కురిపించే ఆఫర్లను ఆయన తిరస్కరించడం నేను కళ్లారా చూశాను. ఎవరినీ తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు కానీ, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికే ఈ ఉదాహరణ" అని హరీష్ పేర్కొన్నారు.

2012లో రూ. 200 కోట్ల ఆదాయంతో

పవన్ కల్యాణ్ తన కెరీర్‌లో యాడ్స్ చేయడం చాలా అరుదు. 2001లో వచ్చిన పెప్సీ ప్రకటన మినహా ఆయన పెద్దగా ఏ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయలేదు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 2012లో షారుఖ్ ఖాన్ సుమారు రూ. 202 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండేవారు. అలాంటి స్టార్‌తో సమానంగా ఆఫర్లు వచ్చినా పవన్ కల్యాణ్ కాదనుకోవడం ఆయన సిద్ధాంతాలకు నిదర్శనం.

తేరీకి రీమెక్ అంటూ

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ తన కమిట్‌మెంట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తమిళ సూపర్ హిట్ తేరీకి రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More