ఓటీటీలో చిరంజీవి విధ్వంసం.. 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు మూవీ
మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోనూ అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ధాటికి బాక్సాఫీస్ రికార్డులే కాదు ఓటీటీ రికార్డులు కూడా కనుమరుగవుతున్నాయి. జీ5 ఓటీటీలో ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది.
మెగాస్టార్ చిరంజీవి దూకుడు మామూలుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లలో రూ.380 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు మూవీ ఇదే.

మన శంకరవరప్రసాద్ గారు@500 మిలియన్
అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు జీ5 ఓటీటీలో 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “మెగా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్.. ది మెగా విక్టోరియస్ బ్లాక్‌బస్టర్ అన్‌స్టాపబుల్. మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఇదే ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ కూడా ఈ మార్క్ అందుకుంది. ఈ రెండు తెలుగు సినిమాలు కాకుండా అజిత్ నటించిన వలీమై మూవీ కూడా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులో చేరింది. మన శంకరవప్రసాద్ గారు జీ5 ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా ఈ రికార్డుకు ఓ కారణమైంది.
ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తొలి 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్, తొలి వారం 300 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా 500 మార్క్ అందుకొని మరో రికార్డును క్రియేట్ చేసింది.
బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 380 కోట్లకుపైగా..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 380 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే దాదాపు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇందులో చిరంజీవి ఒక సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు. తన మాజీ భార్య (నయనతార) కోరిక మేరకు రాజకీయంగా ఎంతో శక్తివంతుడైన ఆమె తండ్రిని రక్షించడానికి అతడు తిరిగి వస్తాడు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన భార్య ప్రేమను మళ్ళీ ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. క్లీన్ ఫ్యామిలీ కంటెంట్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు జీ5 ఓటీటీలో మూవీని చూడొచ్చు. అంతేకాదు ఫిబ్రవరి 28న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా కాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


