మా అమ్మ చేసిన ప్రార్థనల ప్రతిఫలమే నువ్వు- వాలంటైన్స్ డే వేళ నయనతార ఎమోషనల్ పోస్ట్- భర్త విఘ్నేష్ శివన్ రియాక్షన్ ఇదే!
లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తమ పదో వాలెంటైన్స్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన సందేశాలు షేర్ చేశారు. దీంతో నయనతార, విఘ్నేష్ శివన్ పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వెండితెరపై ‘లేడీ సూపర్ స్టార్’గా వెలిగిపోతున్న నయనతార తన వ్యక్తిగత జీవితంలోనూ అంతే సంతోషంగా ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార బంధం మొదలై పదేళ్లు దాటింది. పెళ్లి తర్వాత వీరు జరుపుకుంటున్న నాలుగో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఒకరిపై ఒకరు కురిపించుకున్న ప్రేమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

“నువ్వే నా బలం.. నా సర్వస్వం”
తన భర్త విఘ్నేష్‌తో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న నయనతార ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ రాసింది. “కొన్ని ఆత్మలు మనం కలవకముందే మన విధిలో రాసిపెట్టి ఉంటాయి. నా విషయంలో నువ్వు అలాంటి వ్యక్తివే. మా అమ్మ చేసిన ప్రార్థనల ప్రతిఫలమే నువ్వు నా జీవితంలోకి రావడం. నీతో గడిపిన ఈ పదేళ్ల ప్రయాణం అద్భుతం. నువ్వు ఒక్క రోజు దూరంగా ఉన్నా నేను నిన్ను మిస్ అవుతూనే ఉంటాను” అని నయన్ తన మనసులోని మాటను భావోద్వేగంగా బయటపెట్టింది.
ప్రశాంతమైన బలం
విఘ్నేష్‌ను తన ‘ప్రశాంతమైన బలం’గా నయన్ అభివర్ణించింది. “నిజమైన ప్రేమ అంటే సహనం, విశ్వాసం, మంచితనం అని నీతో ఉన్నప్పుడే తెలిసింది. లోకం భారంగా అనిపించినప్పుడు నాకు తోడుగా నిలబడినందుకు థాంక్యూ. నేను నిన్ను కేవలం ప్రేమించడం మాత్రమే కాదు.. ప్రతిరోజూ నిన్నే నా భాగస్వామిగా కోరుకుంటాను” అంటూ ఎమోషనల్ అయింది స్టార్ హీరోయిన్ నయనతార.
“మనం రాజుల కంటే ధనవంతులం”
మరోవైపు విఘ్నేష్ శివన్ తన పిల్లలు ఉయిర్, ఉలగ్‌లతో కలిసి ఉన్న అందమైన ఫోటోను షేర్ చేశాడు. “మన చేతులు తెరిచి చూస్తే ఏమీ ఉండకపోవచ్చు.. కానీ, మన హృదయాన్ని చూస్తే అందులో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. మనల్ని ప్రతిక్షణం ప్రేమించే వ్యక్తి తోడుంటే, మనం రాజుల కంటే ధనవంతులం. దేవతల ఆశీస్సులు ఉన్నట్లే” అంటూ ప్రేమపై తనకున్న నమ్మకాన్ని చాటిచెప్పాడు విఘ్నేష్ శివన్.
నయన్ సినిమాల విషయానికొస్తే..
ఇదిలా ఉంటే, ప్రస్తుతం నయనతార వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సెంథిల్ నల్లసామి దర్శకత్వంలో వస్తున్న పిరియడ్ యాక్షన్ డ్రామా ‘రాక్కాయీ’ (Rakkayie)లో నయనతార నటిస్తోంది. అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ సరసన ‘పేట్రియాట్’ (Patriot) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మన శంకర వరప్రసాద్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇవే కాకుండా ‘డియర్ స్టూడెంట్స్’, ‘టాక్సిక్’ చిత్రాలు కూడా నయనతార ఖాతాలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే చిరంజీవి, వెంకటేష్ నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో హీరోయిన్‌గా చేసి సూపర్ హిట్ అందుకున్నారు నయనతార. జీ5లో మన శంకర వర ప్రసాద్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


