సినిమా పోయినా పర్లేదు కానీ ప్రశాంతత ముఖ్యం.. అతనితో ప్రేమాయణంపై టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా ఎమోషనల్ కామెంట్స్!

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తారా సుతారియా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై నోరు విప్పారు. సినిమాలు కోల్పోయినా పర్వాలేదు కానీ తన మనశ్శాంతిని మాత్రం వదులుకోనని, నెగెటివిటీని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని ఆమె స్పష్టం చేశారు. దీంతో తారా సుతారియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 08, 2026 11:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ తారా సుతారియా ఈ మధ్య కాలంలో తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా వీర్ పహారియాతో ఆమె ప్రేమాయణం, ఆపై బ్రేకప్ గురించి నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తన మానసిక ప్రశాంతత, పబ్లిక్ ఇమేజ్ గురించి తారా సుతారియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా పోయినా పర్లేదు కానీ ప్రశాంతత ముఖ్యం.. అతనితో ప్రేమాయణంపై టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా ఎమోషనల్ కామెంట్స్!
సినిమా పోయినా పర్లేదు కానీ ప్రశాంతత ముఖ్యం.. అతనితో ప్రేమాయణంపై టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా ఎమోషనల్ కామెంట్స్!

మనశ్శాంతి కోసం దేనికైనా సిద్ధమే

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ఎల్లె ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారా సుతారియా తన మనసులోని మాటను బయటపెట్టారు. "వృత్తి పరమైన విజయం కంటే అంతర్గత ప్రశాంతతే అసలైన విజయమని నేను నమ్ముతాను. కొద్దిమంది ఆత్మీయులు, మన గురించి మనకు తెలిసిన సత్యం.. ఇవే జీవితంలో ముఖ్యం. నా విలువల కోసం ఎన్నోసార్లు సినిమాలను వదులుకున్నాను. నన్ను నేను కోల్పోయే కంటే, ఒక సినిమాను కోల్పోవడమే నాకు ఇష్టం" అని తారా సుతారియా తేల్చి చెప్పారు.

తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహాగానాలు, వీర్ పహారియాతో ప్రేమాయణం గురించి స్పందిస్తూ.. "ప్రతి విషయాన్ని అందరికీ వివరించాల్సిన అవసరం నాకు లేదు. నిజం ఏంటో నాకు, నా సన్నిహితులకు తెలిస్తే చాలు" అని తారా సుతారియా పేర్కొన్నారు.

నెగెటివిటీపై గట్టి కౌంటర్

ఇటీవల సింగర్ ఏపీ థిల్లాన్ కన్సర్ట్‌లో తారా సుతారియా చేసిన డ్యాన్స్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆమె ఘాటుగానే స్పందించారు. తనపై ఎవరో కావాలనే 'పెయిడ్ పీఆర్' క్యాంపెయిన్ నడిపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

"తప్పుడు కథనాలు, ఎడిటింగ్ చేసిన వీడియోలు మమ్మల్ని ఏమీ చేయలేవు. చివరకు ప్రేమే గెలుస్తుంది" అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనపై విమర్శలు చేసేవారికి గట్టిగా సమాధానమిచ్చారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా ఏపీ థిల్లాన్, వీర్ పహారియా కూడా కామెంట్స్ చేశారు. అయితే ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే తారా, వీర్ విడిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి.

యశ్ ‘టాక్సిక్’లో కీలక పాత్ర

ఇదిలా ఉంటే, ప్రస్తుతం తారా సుతారియా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సరసన ‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్స్‌తోపాటు తారా కూడా కీ రోల్ చేస్తున్నారు.

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ టాక్సిక్ చిత్రం మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, ఇటీవల విడుదలైన టాక్సిక్ గ్లింప్స్ కాంట్రవర్సీకి గురైన విషయం తెలిసిందే.