మన శంకర వరప్రసాద్ గారులో మెరిసిన చైల్డ్ ఆర్టిస్ట్- సీరియల్ నటిగా సాయి ప్రియా రెడ్డి కామెడీ- ఇన్ని సినిమాల్లో నటించిందా?
చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటుంది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా ఓటీటీలోనూ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే, తాజాగా ఈ సినిమాలో సీరియల్ నటిగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయి ప్రియా రెడ్డి గురించి నెటిజన్స్ ఆరాలు తీయడం విశేషంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి నటించి సూపర్ హిట్ కొట్టిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో అలరించిన ఈ సినిమాకు హిట్ మేషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

రూ. 350 కోట్లకుపైగా కలెక్షన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి జనవరి 12న థియేటర్లలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఏంగా రూ. 350 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ సినిమా.
అలాంటి మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయి కూడా దూసుకుపోతోంది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో తెలుగులో మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ మూవీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటోంది.
కామెడీతో అట్రాక్ట్
అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కనిపించిన ప్రతి పాత్రకు ఆడియెన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అందులోనూ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య చేసిన పాత్ర అందరిని కామెడీతో బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సీరియల్ సినిమాలో చివరి వరకు నడుస్తుంది.
మన శంకర వర ప్రసాద్ గారు కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో సదరు నటి కోసం అందరూ వెదుకులాట ప్రారంభించేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన నటి పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి ప్రియ రెడ్డి. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్ని చేసింది.
ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది సాయి ప్రియా రెడ్డి. రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ ఈ అమ్మాయి నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది సాయి ప్రియా రెడ్డి.
ఓటీటీ రిలీజ్ తర్వాత
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ తర్వాత సాయి ప్రియా రెడ్డికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె గురించి సోషల్ మీడియాలో ఆరాలు తీస్తున్ననెటిజన్స్‌కు సాయి ప్రియా రెడ్డి ఇదివరకు చేసిన సినిమాలు చూసి 'ఇన్ని మూవీస్‌లో నటించిందా?' అని ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక ముందు ఈ బ్యూటీ సాయి ప్రియా రెడ్డికి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


