తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్.. 43వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే.. టాప్ 6లో అన్నీ స్టార్ మా సీరియల్సే
తెలుగు టీవీ సీరియల్స్ 43వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. టాప్ 6లో అన్నీ స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. ఇక కార్తీక దీపం 2 సీరియల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. గుండె నిండా గుడి గంటలు నాలుగో స్థానానికి పడిపోయింది.
స్టార్ మాతోపాటు జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ ఏడాది 43వ వారానికి సంబంధించిన రేటింగ్స్ రాగా.. ఇందులో తొలి ఆరు స్థానాల్లో స్టార్ మా ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. రేటింగ్స్, సీరియల్స్ స్థానాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. మరి టాప్ 10లో ఉన్న ఆ సీరియల్స్ ఏవో చూడండి.

కార్తీక దీపం 2 టాప్‌లోనే..
తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే స్టార్ మా ఛానెల్లో వచ్చే కార్తీక దీపం 2 సీరియల్ తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ సీరియల్ కు తాజాగా 14.36 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. దీనికి 13.84 రేటింగ్ వచ్చింది. ఇక ఇంటింటి రామాయణం సీరియల్ ఈసారి నాలుగు నుంచి మూడుకు వచ్చింది.
తాజా రేటింగ్స్ లో దీనికి 11.60 రేటింగ్ నమోదైంది. ఇక గుండె నిండా గుడి గంటలు నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి తాజాగా 11.39 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 10.84 రేటింగ్ ఉంది. ఆరో స్థానంలోనూ స్టార్ మాకే చెందిన నిండు మనసులు సీరియల్ నిలిచింది. తాజాగా ఈ సీరియల్ కు 8.37 రేటింగ్ నమోదైంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక టాప్ 10లో మిగిలిన నాలుగు స్థానాల్లోనూ జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. ఈ ఛానెల్లో మేఘ సందేశం టాప్ సీరియల్ గా కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 43వ వారం 8.09 రేటింగ్ నమోదైంది. ఓవరాల్ గా ఏడో స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత 8వ స్థానంలో లక్ష్మీ నివాసం 7.53 రేటింగ్ తో ఉంది. 9వ స్థానంలో చామంతి సీరియల్ ఉంది. దీనికి 7.10 రేటింగ్ నమోదైంది. పదో స్థానంలో జగద్ధాత్రి సీరియల్ నిలిచింది. దీనికి తాజాగా 7.01 రేటింగ్ వచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


