టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ ఇవే.. 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ హవా
టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ జాబితా వచ్చేసింది. తాజాగా 42వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో టాప్ 5లో స్టార్ మాకు చెందిన సీరియల్సే ఉన్నాయి. టాప్ 10లో నాలుగు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి.
తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 42వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులో మరోసారి కార్తీకదీపం 2 సీరియల్ తన తొలి స్థానాన్ని నిలుపుకుంది. అంతేకాదు మొత్తంగా టాప్ 10లో ఆరు స్టార్ మా, నాలుగు జీ తెలుగు ఛానెల్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా సీరియల్స్ మరోసారి సత్తా చాటాయి. ఈ ఏడాది 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. అందులో కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలో ఉంది. ఈ సీరియల్ రేటింగ్ తగ్గినా.. టాప్ లోనే ఉంది. ఈవారం ఈ సీరియల్ కు 13.99 రేటింగ్ నమోదైంది. గతవారం ఇది 14.90గా ఉండేది. ఈ సీరియల్ ఈ మధ్యే 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది.
ఈ సీరియల్ కు 13.47 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్ ఈ మధ్యే 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మూడో స్థానంలోకి మరోసారి గుండె నిండా గుడి గంటలు వచ్చి చేరింది. ఈ సీరియల్ కు 12.06 రేటింగ్ నమోదైంది. ఇంటింటి రామాయణం నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 42వ వారం 11.40 రేటింగ్ వచ్చింది. ఇక ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు 10.89 రేటింగ్ నమోదైంది. ఇక నిండు మనసులు సీరియల్ ఆరు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 8.14 రేటింగ్ వచ్చింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో నాలుగు చోటు సంపాదించాయి. తాజాగా ఆరో స్థానానికి ఈ ఛానెల్ కు చెందిన మేఘ సందేశం వచ్చి చేరింది. ఈ సీరియల్ కు 8.40 రేటింగ్ నమోదైంది. ఇక ఎనిమిదో స్థానంలో లక్ష్మీనివాసం ఉంది.
దీనికి 7.74 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో ఉన్న చామంతి సీరియల్ కు 7.54, పదో స్థానంలో ఉన్న జగద్ధాత్రికి 7.47 రేటింగ్స్ నమోదయ్యాయి. మరో టాప్ సీరియల్ జయం టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది. దీనికి 7.26 రేటింగ్ వచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


