300 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న టాప్ స్టార్ మా సీరియల్.. తొలి వారం నుంచే టీఆర్పీ రేటింగ్స్‌లో దూకుడు..

స్టార్ మా సీరియల్స్ లో మొదటి నుంచీ మురిపిస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తాజాగా మరో మైలురాయిని అందుకుంది. సోమవారం (అక్టోబర్ 27)తో ఈ సీరియల్ 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆ ఛానెల్ వెల్లడించింది.

Published on: Oct 27, 2025, 15:58:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ మా సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. సీనియర్ నటీనటులు ప్రభాకర్, ఆమని లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా మొదటి నుంచీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ సీరియల్ 300 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది.

300 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న టాప్ స్టార్ మా సీరియల్.. తొలి వారం నుంచే టీఆర్పీ రేటింగ్స్‌లో దూకుడు..
300 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న టాప్ స్టార్ మా సీరియల్.. తొలి వారం నుంచే టీఆర్పీ రేటింగ్స్‌లో దూకుడు..

ఇల్లు ఇల్లాలు పిల్లలు@300 ఎపిసోడ్స్

ఆమని, ప్రభాకర్ నటిస్తున్న స్టార్ మా సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 12న ఈ సీరియల్ ప్రారంభం కాగా.. తాజాగా సోమవారం (అక్టోబర్ 27)తో ఈ మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “కలిసి నవ్వుతూ, ఏడుస్తూ, ఎదుగుతున్న ఓ కుటుంబానికి 300 ఎపిసోడ్లు. మీ ప్రేమ, మద్దతు ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకం చేసింది.

మరెన్నో జ్ఞాపకాల కోసం సిద్ధమవుతూ.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 7.30 గంటలకు మీ స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఆ ఛానెల్ షేర్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. ప్రతి ఇంటి కథగా నిలిచిన ప్రయాణం అనే పదాలు ఆ పోస్టర్ పై ఉండగా.. అందులో సీరియల్లోని లీడ్ క్యారెక్టర్లన్నింటినీ చూడొచ్చు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టీఆర్పీ రేటింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రారంభమైన కొన్నాళ్లకే టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్లింది. దీనికంటే ముందు రాత్రి 7.30 గంటలకు వచ్చిన బ్రహ్మముడి సీరియల్ నంబర్ వన్ కాగా.. అలాంటి సీరియల్ ను తప్పించి ఇల్లు ఇల్లాలు పిల్లలను తీసుకొచ్చారు. అంచనాలకు తగ్గకుండా ఈ సీరియల్ కూడా దూసుకెళ్తూనే ఉంది. టీఆర్పీ రేటింగ్స్ లో నిలకడగా రెండో స్థానంలోనే ఉంటూ వస్తోంది.

తాజాగా 41వ వారం రేటింగ్స్ లోనూ ఈ సీరియల్ 14.02 రేటింగ్ తో కార్తీక దీపం 2 సీరియల్ తర్వాత రెండో స్థానంలో ఉంది. అప్పుడప్పుడూ మూడు, నాలుగు స్థానాల్లోకి పడిపోయినా.. చాలా వరకు తన స్థానాన్ని నిలుపుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రభాకర, ఆమినిలాంటి సీనియర్ నటీనటులు ఈ సీరియల్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More