అప్పుడు యశ్ అండర్‌డాగ్.. ఇప్పుడు నేను.. అందరినీ సర్‌ప్రైజ్ చేయడం నాకు అలవాటుగా మారింది: అడివి శేష్ కామెంట్స్

అడివి శేష్ లీడ్ రోల్లో నటిస్తున్న డెకాయిట్ మూవీ వచ్చే ఏడాది యశ్ నటిస్తున్న టాక్సిక్ తో బాక్సాఫీస్ దగ్గర ఫైట్ చేయనుంది. దీనిపై తాజాగా శేష్ స్పందించాడు. కేజీఎఫ్ సమయంలో యశ్ అండర్‌డాగ్ అని, ఇప్పుడు తాను అండర్‌డాగ్ అని అన్నాడు.

Published on: Nov 5, 2025, 21:35:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అడివి శేష్ మూవీ 'డెకాయిట్' అనౌన్స్ చేసి ఏడాది దాటింది. మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాస్తవానికి ఈ డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే శేష్‌కి అయిన గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది.

అప్పుడు యశ్ అండర్‌డాగ్.. ఇప్పుడు నేను.. అందరినీ సర్‌ప్రైజ్ చేయడం నాకు అలవాటుగా మారింది: అడివి శేష్ కామెంట్స్
అప్పుడు యశ్ అండర్‌డాగ్.. ఇప్పుడు నేను.. అందరినీ సర్‌ప్రైజ్ చేయడం నాకు అలవాటుగా మారింది: అడివి శేష్ కామెంట్స్

అదే రోజు కన్నడ సూపర్ స్టార్ యశ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' కూడా విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ 'క్లాష్', సినిమా ఆలస్యం, విడుదల తేదీ గురించి హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్ ప్రత్యేకంగా మాట్లాడాడు.

'డెకాయిట్' ఆలస్యంపై శేష్ వివరణ

'డెకాయిట్' మూవీ విడుదలకు సిద్ధమయ్యే సరికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ గురించి అడివి శేష్ మాట్లాడాడు. “నేను ఎప్పుడూ సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాను. ఇదివరకు నేను ఎవరికీ అంతగా తెలియదు కాబట్టి పట్టించుకునేవారు కాదు. 'మేజర్' విషయంలో ఆ ఆలస్యం కోవిడ్-19 వల్ల జరిగింది అని అంతా అనుకున్నారు.

నేను సాధారణంగా ఒక సినిమా పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకుంటాను. కానీ ఈసారి నాకు గాయం కావడంతో మరింత ఆలస్యం జరిగింది. మిగిలిన హెవీ-డ్యూటీ యాక్షన్ సన్నివేశాలను 2-3 నెలల పాటు నేను చేయలేకపోయాను. నేను ఇంకా కోలుకుంటున్నాను.. చికిత్సలో ఉన్నాను" అని తెలిపాడు.

నిజానికి 'డెకాయిట్' ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో, నిర్మాతలు విడుదల తేదీని మార్చి 19, 2026కు మార్చారు. ఆ తేదీన ఉగాది పండుగ కూడా ఉంది. యశ్ 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత నటిస్తున్న తొలి మూవీ 'టాక్సిక్' కూడా అదే రోజున విడుదలవుతోంది.

'క్లాష్ అనేది మీడియా కోసమే': శేష్

ఒకే రోజు సినిమాలు విడుదలైనా అవి విజయవంతం కావచ్చని శేష్ బలంగా నమ్ముతున్నాడు. "ఒకే రోజు విడుదలైన సినిమాలు కూడా ఆడగలవు. చిన్నప్పుడు నాకు గుర్తుంది.. లగాన్, గదర్ ఒకే రోజు విడుదలయ్యాయి. రెండూ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. క్లాష్ అనేది మనం మీడియాలో వాడే పదం అనుకుంటున్నాను.

ప్రేక్షకులకు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటమే ముఖ్యం. వారికి పెద్దగా పట్టదు. నా సినిమా 'మేజర్' కూడా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో క్లాష్ అయింది. అయినా బాగా ఆడింది. ఒక సినిమా బాగుంటే, అది ప్రేక్షకులను కచ్చితంగా చేరుకుంటుంది" అని శేష్ స్పష్టం చేశాడు. అదే వీకెండ్ లో ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగలు ఒకేసారి వస్తున్నాయని, ఇది నిజంగా వేడుక సమయం అవుతుందని శేష్ అన్నాడు.

ఇప్పుడు నేను అండర్‌డాగ్

అయితే ఈ క్లాష్‌ను తక్కువ చేసి చూసినా, 'టాక్సిక్' వంటి భారీ సినిమాతో పోటీ పడటం అంత తేలికైన పని కాదని అతడు గుర్తించాడు. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న యశ్ మళ్లీ తెరపైకి వస్తున్న సినిమా ఇది. అందువల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరాటంలో తాను అండర్‌డాగ్‌గా ఉన్నానని చెప్పిన శేష్, ఆ అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు.

“2018లో 'కేజీఎఫ్ ఛాప్టర్ 1' షారుక్ ఖాన్ ‘జీరో’తో పోటీపడినప్పుడు, అది అద్భుతంగా ఆడింది. సినిమా మేకింగ్ సంస్కృతినే మార్చేసింది. అప్పుడు కేజీఎఫ్ అండర్‌డాగ్. ఇప్పుడు నేనే ఆ అండర్‌డాగ్. నేను సంతోషంగా నా కెరీర్‌ను అండర్‌డాగ్‌గా నిర్మించుకున్నాను. నా కెరీర్ అంతా కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చుట్టే తిరిగింది. ఇదొక అలవాటుగా మారిందనుకుంటాను” అని నవ్వుతూ చెప్పాడు.

'డెకాయిట్' గురించి..

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ మూవీని తెలుగు, హిందీలలో ఒకేసారి షూట్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ రిలీజ్ కు మరో డేట్ చూద్దామని అనుకున్నా.. ఉగాది, గుడి పడ్వా, ఈద్ కలిసి రావడం, విద్యార్థులకు పరీక్షలు అయిపోయే సమయం కావడంతో ఆ తేదీనే ఫిక్స్ చేసినట్లు అడివి శేష్ చెప్పాడు.

రెండు భాషల్లో ఒకేసారి తీస్తుండటంపై శేష్ స్పందించాడు. “ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయా సంస్కృతులలో ఉన్న సూక్ష్మమైన భేదాలను సరిగ్గా తీసుకురావడం ఒక సవాలు. ప్రతి సీన్ దాని మాతృభాషలో ప్రేక్షకులకు హత్తుకునేలా ఉండటం చాలా ముఖ్యం. అనువదించినట్లు అనిపించకూడదు. కొన్ని సన్నివేశాల్లో మేము మొత్తం కథాంశాన్ని, సంభాషణలను పూర్తిగా మార్చేశాం” అని వివరించాడు.

శనైల్ దేవ్ దర్శకత్వం వహించిన 'డెకాయిట్'లో శేష్, మృణాల్‌తో పాటు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్'లో యశ్ తో పాటు టోవినో థామస్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు మార్చి 19, 2026న విడుదల కానున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More