దర్శకుల వెంట పడటంలో తప్పు లేదు, ఆకలితో ఉన్నట్లు తెలియాలి- బతిమిలాడేదాన్ని, ఫస్ట్ డైరెక్టర్ ఆయనే: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్‌లో అవుట్‌సైడర్‌గా అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు. అవకాశాల కోసం దర్శకుల వెంట పడటంలో తప్పులేదని, తన తాజా చిత్రం 'దో దీవానే షెహర్ మే' కూడా అలా వచ్చిందేనని, ఆకలితో ఉన్నట్లు తెలిస్తేనే వాళ్ల ఆలోచన విధానం మారుతుందని మృణాల్ ఠాకూర్ చెప్పారు.
సినిమా పరిశ్రమలో వారసత్వం లేకుండా నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. సుమారు 15 ఏళ్ల క్రితం నటిగా కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ నేడు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి మృణాల్ ఠాకూర్ పడ్డ శ్రమ, చూపిన ధైర్యం సామాన్యమైనవి కావని చెబుతోంది. తాజాగా ఇచ్చిన సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ రహస్యాలను మృణాల్ ఠాకూర్ బయటపెట్టారు.
స్వయంగా వెళ్లి
అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రవి ఉద్యావర్ డైరెక్ట్ చేసిన సినిమా 'దో దీవానే షెహర్ మే' (Do Deewane Seher Mein). ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేశారు. అయితే, ఈ సినిమాలో అవకాశం మృణాల్ ఠాకూర్‌కు తలుపు తట్టి రాలేదట. ఆమెనే స్వయంగా వెళ్లి హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారని చెబుతోంది ఈ బ్యూటి.
"రవి సర్ తీసిన 'మామ్' సినిమా చూశాక ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. నేనే నేరుగా వెళ్లి.. సర్, మనం నెక్ట్స్ సినిమా ఎప్పుడు చేస్తున్నాం? అని అడిగేశాను. నాలో ఉన్న ఆ ధైర్యమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని నేను నమ్ముతాను" అని మృణాల్ ఠాకూర్ న్యూస్18తో పేర్కొన్నారు.
దర్శకుల వెంట పడటం తప్పు కాదు..
కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని మృణాల్ గుర్తుచేసుకున్నారు. "ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం దర్శకులకు కనిపించేలా చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. సర్, నేను ఇక్కడే ఉన్నాను.. ఏదో ఒక రోజు నన్ను తప్పకుండా కాస్ట్ చేయండి అని బతిమిలాడేదాన్ని" అని మృణలా ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
"'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ గారే నేను పని కోసం అడిగిన మొదటి వ్యక్తి. అప్పట్లో పని ఎలా అడగాలో కూడా నాకు సరిగ్గా తెలియదు" అని మృణాల్ ఠాకూర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
దర్శకుల ఆలోచన విధానం మారుతుంది
ఒక నటి ఏదైనా పాత్ర కోసం ఆకలితో ఉందని తెలిస్తే, దర్శకుల ఆలోచనా విధానం కూడా మారుతుందని మృణాల్ అభిప్రాయపడ్డారు. తనకు నచ్చిన వ్యక్తులకు, వారు వ్యక్తిగతంగా తెలియకపోయినా సరే, మెసేజ్ చేసి తన ఆసక్తిని తెలపడం మృణాల్‌కు అలవాటు అట.
ఫిబ్రవరి 20న ‘దో దీవానే షెహర్ మే’ విడుదల
ఇక మృణాల్ ఠాకూర్, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా దో దీవానే షెహర్ మే ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. ఇది ఒక అరేంజ్‌డ్ మ్యారేజ్ నేపథ్యంలో సాగే కథ. శారీరక, వ్యక్తిగత అభద్రతా భావాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, ఆత్మీయత ఎలా చిగురించాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












