ధనుష్‌తో పెళ్లి వార్తలు- పుకార్లు సృష్టించిన వారికి థ్యాంక్స్ చెప్పిన మృణాల్ ఠాకూర్- కోట్లు ఖర్చు పెట్టిన కూడా అంటూ!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధనుష్‌తో పెళ్లి వార్తలపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా మరోసారి స్పందించారు. వాలంటైన్స్ డే రోజున ధనుష్‌తో తన వివాహం జరుగుతుందని పుకార్లు సృష్టించిన వారికి మృణాల్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపింది. ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్స్‌లో మృణాల్ కామెంట్స్ చేసింది.

Feb 15, 2026, 21:52:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ప్రేక్షకులకు 'సీతా రామం' సినిమాతో చేరువైన బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆమె సినిమాలు కాదు.. ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లు అని తెలిసిందే.

ధనుష్‌తో పెళ్లి వార్తలు- పుకార్లు సృష్టించిన వారికి థ్యాంక్స్ చెప్పిన మృణాల్ ఠాకూర్- కోట్లు ఖర్చు పెట్టిన కూడా అంటూ!
ధనుష్‌తో పెళ్లి వార్తలు- పుకార్లు సృష్టించిన వారికి థ్యాంక్స్ చెప్పిన మృణాల్ ఠాకూర్- కోట్లు ఖర్చు పెట్టిన కూడా అంటూ!

ధనుష్‌తో వివాహం

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోనుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ రోజు గడిచిపోయినా మృణాల్ ఠాకూర్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. దీంతో అవి రూమర్స్‌గా మిగిలిపోయాయి.

వదంతులు చూసి నవ్వుకున్నా!

అయితే, వాలంటైన్స్ డే రోజున ధనుష్‌తో తన పెళ్లి అనే పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు. "అవును, వాళ్ల (సోషల్ మీడియా) ప్రకారం నా పెళ్లి జరిగిపోతోంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు నాకు నవ్వొస్తుంది" అని మృణాల్ ఠాకూర్ తెలిపారు.

కోట్లు ఖర్చు పెట్టిన ఇంత రాదు

"నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం చూసి నేను అస్సలు విసుగు చెందను. నిజానికి, నేను కోట్లు ఖర్చు పెట్టి పీఆర్ (PR) టీమ్‌ను పెట్టుకున్నా నాకు ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. అందుకే నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారందరికీ పెద్ద థాంక్స్" అని చమత్కరించారు మృణాల్ ఠాకూర్.

పెళ్లి ఒత్తిడిపై మృణాల్

తన జీవితంలో ఏదైనా విశేషం ఉంటే తానే స్వయంగా బయటపెడతానని మృణాల్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి ఒత్తిడి ఉందా? అని అడిగినప్పుడు మృణాల్ ఠాకూర్ ఇచ్చిన సమాధానం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

సన్యాసిలా బతకడం లాంటిదే

"సెటిల్ అయిపోమని వాళ్లు అడుగుతూనే ఉంటారు. కానీ, ఒక నటిగా కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో నా కుటుంబానికి తెలుసు. ముఖ్యంగా సౌత్ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో నటించడం తేలికైన విషయం కాదు. తిండి, నిద్ర వదిలేసి పని మీదే శ్రద్ధ పెట్టాలి. అది ఒక రకంగా సన్యాసిలా బతకడం లాంటిదే" అని మృణాల్ తన వృత్తిలోని కష్టాలను వివరించారు.

మృణాల్ ఠాకూర్ మూవీ

ప్రస్తుతం కెమెరాతోనే తన ప్రేమాయణం సాగుతోందని మృణాల్ ఠాకూర్ చమత్కరించారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ (Do Deewane Seher Mein) ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.

అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం

ఇందులో ఆమె సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే ఒక ఆధునిక యువతి పాత్రలో కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More