దిగ్గజ దర్శకుడు, నటుడు కన్నుమూత- ఫిలిం ఛాంబర్ సమావేశంలోనే గుండెపోటు- చివరి శ్వాస వరకు సినిమాకోసం పాటు పడిన జో సైమన్!

సుప్రసిద్ధ కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) కన్నుమూశారు. బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో సమావేశానికి హాజరైన సమయంలో గుండెపోటు రావడంతో జో సైమన్ తుదిశ్వాస విడిచారు. వందకు పైగా చిత్రాల్లో పనిచేసిన ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Feb 14, 2026, 11:48:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. కన్నడ దిగ్గజ దర్శకుడు, నటుడు, గీత రచయిత జో సైమన్ (80) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన, చివరి నిమిషం వరకు సినిమా చర్చల్లోనే ఉండటం గమనార్హం.

దిగ్గజ దర్శకుడు, నటుడు కన్నుమూత- ఫిలిం ఛాంబర్ సమావేశంలోనే గుండెపోటు- చివరి శ్వాస వరకు సినిమాకోసం పాటు పడిన జో సైమన్!
దిగ్గజ దర్శకుడు, నటుడు కన్నుమూత- ఫిలిం ఛాంబర్ సమావేశంలోనే గుండెపోటు- చివరి శ్వాస వరకు సినిమాకోసం పాటు పడిన జో సైమన్!

సమావేశంలోనే కుప్పకూలిన వైనం

శుక్రవారం (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం బెంగళూరులోని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)లో జరిగిన ఒక సమావేశానికి జో సైమన్ హాజరయ్యారు. అక్కడ ఆయన ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తూ, పరిశ్రమ తరపున ఒక వేడుక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.

అయితే, ఆ చర్చ ముగిసిన కొద్దిసేపటికే హాలు బయట ఉన్న అటెండెంట్ కుర్చీలో కూర్చున్న జో సైమన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ సాయంత్రం 4:30 గంటల సమయంలో జో సైమన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం

మండ్య జిల్లాకు చెందిన జో సైమన్, కన్నడ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా, సంభాషణల రచయితగా, గీత రచయితగా వందకు పైగా సినిమాలకు పనిచేశారు.

మరుపు రాని చిత్రాలు

జో సైమన్ తన కెరీర్‌లో ఎన్నో మరుపురాని సినిమాలను తెరకెక్కించారు. సాహస సింహ, స్నేహద కడలల్లి, సింహ జోడి, మిస్టర్ వాసు వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా విష్ణువర్ధన్ నటించిన ‘సాహస సింహ’ ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.

కన్నడ చిత్ర దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా జో సైమన్ సేవలందించారు. జో సైమన్ మరణం పట్ల కన్నడ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ప్రముఖుల సంతాపం

జో సైమన్ మృతి పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దశాబ్దాలుగా కన్నడ చిత్రసీమలో క్రియాశీలకంగా ఉన్న జో సైమన్ మరణం లోటు తీర్చలేము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకుడు

ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక కూడా సైమన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. జో సైమన్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More