ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన కన్నడ థ్రిల్లర్ మూవీ.. ఐదు నెలల తర్వాత స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 7.6 రేటింగ్
కన్నడ థ్రిల్లర్ మూవీ ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 26) డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ సినిమాను జీ5 ఓటీటీలో చూడొచ్చు.
కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇటీవల వచ్చిన ప్రయోగాత్మక సస్పెన్స్ థ్రిల్లర్లలో 'వృత్త' (Vritta) ఒకటి. బిగ్ బాస్ కన్నడ విజేత షైన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. తన విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

వృత్త మూవీ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన మూవీ వృత్త. ఈ సినిమా సుమారు ఐదు నెలల తర్వాత శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.
వృత్తి సినిమా స్టోరీ ఇలా..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ వృత్త. లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహీర్ మొహియుద్దీన్, హరిణి సుందరరాజన్, చైత్ర జె ఆచార్ (సప్త సాగరాలు దాటి ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించారు.
సిద్ధార్థ్ అనే ఒక రిజర్వ్‌డ్ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక రాత్రి తీసుకున్న తొందరపాటు నిర్ణయం, ఒక ఫోన్ కాల్, రాంగ్ రూట్‌లో వెళ్లడం.. ఇవన్నీ కలిసి అతన్ని ఒక భయానకమైన సుడిగుండంలోకి నెట్టేస్తాయి. గర్భిణి అయిన భార్య, పాత గాయాలు, కుటుంబ సమస్యల మధ్య నలిగిపోతున్న సిద్ధార్థ్.. ప్రాణాలతో బయటపడటానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా.
ఈవారం ఓటీటీలో మరికొన్ని మూవీస్
ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న మరో కన్నడ థ్రిల్లర్ 'ఐ యామ్ గాడ్'. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చింది. ఒక పక్క దేవా, బిందుల ప్రేమకథ.. మరోపక్క 'గాడ్' అనే ముసుగు వేసుకున్న సీరియల్ కిల్లర్ ఆ ఊరిని భయపెట్టడం.. ఈ రెండింటి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 26న రెండు క్రేజీ సినిమాలు విడుదలయ్యాయి. కీర్తి సురేష్ నటించిన 'రివాల్వర్ రీటా' స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రామ్ నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా కూడా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా మిడిల్ క్లాస్ అనే తమిళ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


