ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో ఏకంగా 9.8 రేటింగ్.. దేవుడినని చెప్పుకునే సీరియల్ కిల్లర్

ఓటీటీలోకి ఓ కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ వస్తోంది. ఐఎండీబీలో ఏకంగా 9.8 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. గత నెల 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

Published on: Dec 24, 2025, 21:26:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ (I Am God) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఓ సీరియల్ కిల్లర్ చేసే హత్యలు ఓవైపు, కాలేజీలో ఓ జంట లవ్ స్టోరీ మరోవైపు చూపిస్తూ ఇంట్రెస్టింగా సాగే ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీ విశేషాలేంటో చూడండి.

ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో ఏకంగా 9.8 రేటింగ్.. దేవుడినని చెప్పుకునే సీరియల్ కిల్లర్
ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో ఏకంగా 9.8 రేటింగ్.. దేవుడినని చెప్పుకునే సీరియల్ కిల్లర్

ఐ యామ్ గాడ్ ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గాడ్ నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 24) ఎక్స్ ద్వారా వెల్లడించింది. “పవర్, మిస్టరీ.. ఓ తుఫాను వస్తోంది. ఐ యామ్ గాడ్ డిసెంబర్ 26న కేవలం సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఐ యామ్ గాడ్ మూవీ విశేషాలు

కన్నడ డైరెక్టర్ రవి బీ గౌడ డైెరెక్ట్ చేసి నటించన మూవీ ఐ యామ్ గాడ్. నవంబర్ 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీలో అయితే ఏకంగా 9.8 రేటింగ్ నమోదైంది. ఈ సినిమాలో రవి గౌడతోపాటు విజేత పరీక్, రవిశంకర్, అవినాష్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. నిజానికి ఈ మూవీ ప్రమోషన్లు, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అంచనాలు లేకుండానే రిలీజైంది. అయితే తొలి షో నుంచే ఈ మూవీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మంచి రివ్యూలు వచ్చాయి.

ఓవైపు మాస్కు వేసుకొని, తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి వరుస హత్యలు చేస్తుంటాడు. మరోవైపు కాలేజీలో జంట లవ్ స్టోరీ కూడా నడుస్తుంది. ఈ రెండు స్టోరీలు సమాంతరంగా చూపిస్తుంటారు. అసలు ఈ రెండు స్టోరీలకు లింక్ ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ ఐ యామ్ గాడ్ సినిమాలో చూడొచ్చు. డిసెంబర్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More