ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ఇక్కడ చూసేయండి
ఓటీటీలోకి ఓ హిట్ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను జీ5 ఓటీటీలో చూడొచ్చు. అక్టోబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గ్రీన్ (Green). ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మూవీ ఇది. ఇప్పుడీ సినిమా ఆదివారం (డిసెంబర్ 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

గ్రీన్ ఓటీటీ స్ట్రీమింగ్
ఈమధ్య కన్నడ కంటెంట్ పై ఎక్కువగా దృష్టిసారించిన జీ5 ఓటీటీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ మూవీ పేరు గ్రీన్. డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ రావడం విశేషం. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
గ్రీన్ మూవీ స్టోరీ ఇదే..
రాజ్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ గ్రీన్. ఈ సినిమా కథ ప్రధానంగా "మాయన్న" (గోపాల్ కృష్ణ దేశ్‌పాండే) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. మాయన్న పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. చిన్నప్పుడు విన్న దెయ్యాల కథలు, ముఖ్యంగా అడవిలో ఉండే ఒక వింత రాక్షసుడి గురించిన భయాలు అతన్ని వెంటాడుతుంటాయి.
మరోవైపు రవి అనే పోలీస్ అధికారి ఒక మిస్సింగ్ కేసు (సావిత్రి అనే మహిళ కోసం) దర్యాప్తు చేస్తూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి వింత అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ అడవిలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడా? లేక ఇదంతా మాయన్న భ్రమనా? మనిషిలోని అంతర్గత భయాలే అసలైన రాక్షసులా? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ సాగుతుంది.
ఈ గ్రీన్ ఓ సాధారణ హారర్ సినిమా కాదు. దెయ్యాలను చూపించి భయపెట్టడం కంటే, మనిషి మనసులో ఉండే భయం అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడుస్తుంది. సినిమా చాలా భాగం అడవిలో జరుగుతుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అడవిని ఒక పాత్రలాగా, భయంకరంగా చూపించడంలో చాలా బాగా పనిచేశాయి.
ప్రధాన పాత్ర పోషించిన గోపాల్ కృష్ణ దేశ్‌పాండే నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. భయం, ఆందోళన కలగలిసిన మనిషిగా అతని నటన సినిమాకి హైలైట్. అలాగే బాలాజీ మనోహర్, డింపీ ఫాధ్యా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.
ఇవి ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రకృతిని మనం నాశనం చేస్తే, అది తిరగబడుతుంది అనే చిన్న సందేశం కూడా అంతర్లీనంగా కనిపిస్తుంది. మన మెదడుకు పని చెప్పే, ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్స్ మీకు నచ్చితే.. ఈ "గ్రీన్" సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


