ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ ఇవే.. ఒక్క తెలుగు సినిమాకూ దక్కని చోటు.. కన్నడ, తమిళ సినిమాల హవా
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను రిలీజ్ చేసింది ఐఎండీబీ. బుధవారం (డిసెంబర్ 10) ఈ లిస్టు రాగా.. వీటిలో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు దక్కలేదు. హిందీ, కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు టాప్ 10లో ఉన్నాయి.
ఈ ఏడాది అంటే 2025 సినిమాల పరంగా చాలా రసవత్తరంగా సాగింది. విక్కీ కౌశల్ పీరియడ్ డ్రామా 'ఛావా', రిషబ్ శెట్టి మైథలాజికల్ వండర్ 'కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1', అజయ్ దేవగన్ 'రైడ్ 2' వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కానీ అనూహ్యంగా ఇద్దరు కొత్త ముఖాలతో వచ్చిన ఒక రొమాంటిక్ మ్యూజికల్ సినిమా వీటన్నింటినీ వెనక్కి నెట్టి ఐఎండీబీ 2025 టాప్ మూవీగా నిలిచింది.

నంబర్ 1 స్థానంలో 'సయ్యారా'
బుధవారం (డిసెంబర్ 10)నాడు ఐఎండీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా యూజర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాను విడుదల చేసింది.
మోహిత్ సూరి దర్శకత్వంలో.. అనీత్ పడ్డా, అహాన్ పాండే అనే కొత్త నటీనటులు జంటగా నటించిన 'సయ్యారా' (Saiyaara) ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేసింది. ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ రొమాంటిక్ ఫిల్మ్ గా చరిత్ర సృష్టించింది. ఒక మ్యూజిషియన్, జర్నలిస్ట్ మధ్య సాగే ప్రేమకథ ఇది.
ఐఎండీబీ టాప్ 10 ఇండియన్ మూవీస్, ఓటీటీ
ఈ జాబితాలో సౌత్ సినిమాల హవా కూడా గట్టిగానే ఉంది. మొత్తం లిస్ట్‌లో 5 హిందీ సినిమాలు ఉండగా.. 2 తమిళం, 2 కన్నడ, 1 మలయాళం సినిమాలు ఉన్నాయి.
సయ్యారా - నెట్‌ఫ్లిక్స్
మహావతార్ నరసింహ - నెట్‌ఫ్లిక్స్
ఛావా - నెట్‌ఫ్లిక్స్
కాంతార: ఏ లెజెండ్ - చాప్టర్ 1 - ప్రైమ్ వీడియో
కూలీ - ప్రైమ్ వీడియో
డ్రాగన్ - నెట్‌ఫ్లిక్స్
సితారే జమీన్ పర్ - యూట్యూబ్
దేవా - నెట్‌ఫ్లిక్స్
రైడ్ 2 - జియోహాట్‌స్టార్
లోకా చాప్టర్ 1: చంద్ర - జియోహాట్‌స్టార్
'మహావతార్ నరసింహ' సినిమా రెండో స్థానంలో నిలిచింది. ఒక ఐఎండీబీ ఇయర్-ఎండ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న తొలి యానిమేటెడ్ సినిమా ఇదే కావడం విశేషం. కేవలం సినిమాల జాబితాలోనే కాదు.. 'మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్' జాబితాలోనూ 'సయ్యారా' జంట సంచలనం సృష్టించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా.. ఆమిర్ ఖాన్, రిషబ్ శెట్టి వంటి బడా స్టార్లను వెనక్కి నెట్టి టాప్-2 స్థానాల్లో నిలిచారు.
| ర్యాంకు | టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ 2025 |
|---|---|
| 1 | సయ్యారా |
| 2 | మహావతార్ నరసింహ |
| 3 | ఛావా |
| 4 | కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1 |
| 5 | కూలీ |
| 6 | డ్రాగన్ |
| 7 | సితారే జమీన్ పర్ |
| 8 | దేవా |
| 9 | రైడ్ 2 |
| 10 | లోకా ఛాప్టర్ 1: చంద్ర |
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


