ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ.. రాజశేఖర్ కూతురు హీరోయిన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి ఓ తమిళ రొమాంటిక్ సినిమా వచ్చేస్తోంది. ఇద్దరు వేర్వేరు భావాలు కలిగిన అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ స్టోరీ చూట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్. 

Published on: Dec 10, 2025, 12:21:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ చేరింది. అదే.. ‘ఆరోమలే’. ఈ తమిళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్.

ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ (x)
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ (x)

ఆరోమలే ఓటీటీ

తమిళ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఓటీటీలో అడుగుపెట్టనుంది. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.

మరోవైపు ఇండియా బయట ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఈ మూవీ సింప్లీ సౌత్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ఓటీటీలో ఇండియా బయట ఉన్న దేశాల్లోని ఆడియన్స్ ఆరోమలే మూవీని చూసే ఛాన్స్ ఉంది.

తెలుగులోనూ

ఆరోమలే సినిమా తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ మొత్తం అయిదు భాషల్లో ఓటీటీలోకి వస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇధి నవంబర్ 7, 2025న థియేటర్లలో రిలీజైంది. డైరెక్టర్ గా శారంగ్ త్యాగుకు ఇదే ఫస్ట్ మూవీ.

ఆరోమలే స్టోరీ

ఆరోమలే మూవీ ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా. అజిత్ (కిషన్) ప్రేమ కోరుకునే వ్యక్తి. సినిమాల్లో చూపించినంత అద్భుతంగా ప్రేమ ఉండాలని ఆశిస్తాడు. కానీ అతనికి మాత్రం వరుసగా హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ తో సాగిపోతున్న అజిత్ ను ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగం చేయమని పేరేంట్స్ పంపిస్తారు.

మ్యాట్రిమోనీ ఏజెన్సీ బాస్ అంజలి (శివాత్మిక రాజశేఖర్). ఆమె పెళ్లిళ్లు చేయిస్తుంటుంది కానీ ప్రేమపై పెద్ద ఒపీనియన్ అంటూ ఏం ఉండదు. ప్రేమ అద్భుతం కాదని, అది కేవలం అవసరాల కోసమే అని నమ్ముతుంది. అది లాజిక్ మాత్రమే అని అంటుంది. మరి అజిత్ రొమాంటిక్ లవ్ కలలకు. అంజలి లాజికల్ విధానానికి సెట్ అయిందా? అజిత్ కు నిజమైన లవ్ దొరికిందా? అన్నది ఆరోమలే సినిమాలో చూడాల్సిందే.

జియోహాట్ స్టార్ జోరు

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జోరుమీదుంది. సౌత్ ఇండియా సినిమాలపై పట్టు నిలబెట్టుకోవడం కోసం ప్రత్యేక ప్లాన్లు వేస్తుంది. మంగళవారం రాత్రి సౌత్ అన్ బౌండ్ ఈవెంట్లో 2026లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తీసుకు రాబోతున్న సిరీస్, సినిమా, షోల వివరాలు ప్రకటించింది ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More