ఈ వారం ఓటీటీలోని మలయాళ చిత్రాలు- అదరగొట్టే థ్రిల్లర్లు- ఓ లుక్కేయండి
ఈ వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఇందులో మలయాళం సినిమాలు, సిరీస్ లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మంచి క్రేజ్ ఉండే మలయాళం థ్రిల్లర్లు ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలాంటి వాటి లిస్ట్ పై ఓ లుక్కేయండి.
ఈ వారం ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్, వేర్వేరు జోనర్లలోని సినిమాలు వచ్చాయి. ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం ఓటీటీలోని మలయాళం సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేద్దాం. ఇందులో ఆకట్టుకునే చిత్రాలు, ఉత్కంఠతో ఊపేసే థ్రిల్లర్లు ఉన్నాయి.

ఫెమినిచి ఫాతిమా
ప్లాట్ ఫామ్ : మనోరమా మ్యాక్స్
ఓటీటీ రిలీజ్ డేట్ : డిసెంబర్ 12
ఫాతిమా జీవితం తన కుటుంబాన్ని చూసుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న సంఘటనతో ఆమె పరువు పోతుంది. ఆ పరిస్థితుల్లోనూ మానసిక ధైర్యంతో ఫాతిమా ముందుకు సాగుతుంది. ఆమె పోరాటం మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
ఫార్మా
ప్లాట్ ఫామ్: జియోహాట్ స్టార్
విడుదల తేదీ: డిసెంబర్ 19
నవిన్ పౌలీ ఓటీటీ సిరీస్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. పిఆర్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫార్మా వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ థ్రిల్లర్ లో రజిత్ కపూర్, నారాయణ్, శృతి రామచంద్రన్, వీణా నందకుమార్, ముత్తుమణి తదితరులు నటించారు. మలయాళంతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
అంధకార
ప్లాట్ ఫామ్: సన్ నెక్ట్స్
రిలీజ్ డేట్: డిసెంబర్ 12
థియేటర్లలో రిలీజైన 21 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ అంధకార. ఈ మలయాళ సినిమా ఉత్కంఠ రేపుతుంది. అవయవ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఓ డాక్టర్ అందుకోసం ఓ దివ్యాంగుడైన ట్యాక్సీ డ్రైవర్ ను వాడుకుంటుంది. ఈ క్రమంలో ఆ లేడీ డాక్టర్ పై మరో ముఠా దాడి చేసింది. అప్పుడు దివ్యాంగుడైన ట్యాక్సీ డ్రైవర్ ను ఇరికించి ఆమె తప్పించుకుంటుంది.
తన కుటుంబం కోసం ఈ ట్యాక్సీ డ్రైవర్ ఆ మాఫియా ముఠాతో ఎలా పోరాడాడు? ట్యాక్సీ డ్రైవర్ పై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే మిగతా కథ.
ఈ సినిమాలు
ఇప్పటికే ఓటీటీలో ఇతర మలయాళ సినిమాలు కూడా దూకుడు చూపిస్తున్నాయి. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే అదరగొడుతోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీ తెగ భయపెడుతోంది. సూసైడ్ చేసుకున్న తన క్లాస్ మేట్ ఇంటికి వెళ్లిన అతను ఓ హెయిర్ క్లిప్ తీసుకుని వస్తాడు. అప్పటి నుంచి వింత సంఘటనలు జరుగుతాయి. డైస్ ఇరే మూవీ జియోహాట్ స్టార్ లో ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


