తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కామెడీ మూవీ టీజర్ రిలీజ్.. ఆ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీకి తెలుగు రీమేక్ ఇది

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తెలుగు కామెడీ మూవీ ఓం శాంతి శాంతి శాంతి: టీజర్ రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ జయ జయ జయహే రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Published on: Dec 8, 2025, 20:35:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో మరో కామెడీ ఎంటర్టైనర్ వస్తోంది. అయితే ఇది ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ కావడం విశేషం. ఈ సినిమా టీజర్ ను సోమవారం (డిసెంబర్ 8) మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కామెడీ మూవీ టీజర్ రిలీజ్.. ఆ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీకి తెలుగు రీమేక్ ఇది
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కామెడీ మూవీ టీజర్ రిలీజ్.. ఆ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీకి తెలుగు రీమేక్ ఇది

ఓం శాంతి శాంతి శాంతి: టీజర్ ఇలా

మలయాళం స్టార్ యాక్టర్ బేసిల్ జోసెఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ జయ జయ జయహే తెలుసు కదా. 2022లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే భర్త ఆమె చేతుల్లో ఎలా తన్నులు తిన్నాడు.. తర్వాత ఎలా దారికి వచ్చాడన్న ఫన్నీ స్టోరీతో తెరకెక్కింది.

ఈ సినిమాను ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతి: పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అంబటి ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్.. కొండవీటి ప్రశాంతిగా ఈషా నటిస్తుండటం విశేషం. తాజాగా వచ్చిన టీజర్ ఫన్నీగా సాగిపోయింది. లీడ్ రోల్స్ మధ్య పెళ్లి చూపులు, పెళ్లి, శోభనంలాంటి సీన్లను ఇందులో చూపించారు.

ఓం శాంతి శాంతి శాంతి: గురించి..

ఓం శాంతి శాంతి శాంతి: సినిమాను ఏఆర్ సజీవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతనికిదే తొలి సినిమా. జై క్రిష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. 2022లో విపిన్ దాస్ డైరెక్ట్ చేసిన మలయాళం సినిమా జయ జయ జయహే రీమేక్ ఇది. ఆ సినిమాలో బేసిల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించారు.

ఈ సినిమాకు ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. అలాంటి సినిమాకు రీమేక్ కావడంతో ఓం శాంతి శాంతి శాంతి: సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటిస్తుండటంతో మూవీలో మంచి కామెడీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More