2025లో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ పొందిన 10 వెబ్ సిరీస్‌లు.. కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు.. ఓ లుక్కేయండి
2025లో చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఇందులో ఐఎండీబీ టాప్ రేటింగ్ పొందిన 10 వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడుంది. వీటిపై ఓ లుక్కేయండి.
2025 సంవత్సరంలో ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. వీటిల్లో కొన్ని అదరగొట్టాయి. అలాంటి ఈ ఏడాది విడుదలైన అత్యధిక ఐఎండీబీ రేటింగ్ పొందిన 10 హిందీ వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడుంది. ఓ సారి చూసేయండి. ఈ జాబితాలో ఆర్యన్ ఖాన్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ కూడా ఉంది.

పంచాయత్
అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ పంచాయత్ ఈ ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. పంచాయత్ కొత్త సీజన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 9గా ఉంది. చందన్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా కాంబినేషన్ లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ నాల్గవ సీజన్ ఈ సంవత్సరం విడుదలైంది. ఇదొక పొలిటికల్ డ్రామా, కామెడీ సిరీస్. ఐఎండీబీ ప్రకారం ఈ సిరీస్ కు సుమారు 68 అవార్డులు వచ్చాయి.
ది ఫ్యామిలీ మ్యాన్
జాబితాలో రెండవ స్థానంలో స్పై యాక్షన్ డ్రామా సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఉంది. ఈ సిరీస్ మూడో సీజన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ సిరీస్ ను కృష్ణ డికె, రాజ్ నిడిమోరు తీసుకొచ్చారు. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐఎండీబీ ప్రకారం ఈ సిరీస్ మొత్తం 66 అవార్డులను పొందింది. దీనికి 8.7 రేటింగ్ ఉంది ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
స్పెషల్ ఆప్స్
నీరజ్ పాండే స్పై యాక్షన్ సిరీస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ సీజన్ 2 ఈ ఏడాది విడుదలైంది. ఈ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 8.6 ఉంది. కెకె మీనన్, కరణ్ టక్కర్ వంటి నటులు ఈ సిరీస్ లో కనిపించారు. ఈ సిరీస్ మొత్తం 4 అవార్డులను గెలుచుకుంది. జియోహాట్ స్టార్ ఓటీటీ లో చూడొచ్చు.
పాతాల్ లోక్
క్రైమ్ డ్రామా థ్రిల్లర్ పాతాల్ లోక్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ రెండో సీజన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ సిరీస్ కు 8.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ సిరీస్ ను సుదీప్ శర్మ రూపొందించారు. ఈ సిరీస్ కు 22 అవార్డులు లభించాయి. మీరు ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
రాజీవ్ గాంధీ హత్య కేసు
సోనీ లివ్ వెబ్ సిరీస్ 'ది హంట్: ది రాజీవ్ గాంధీ హత్య కేసు' ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు 7.9 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ సిరీస్ లో అమిత్ సియాల్, గిరీష్ శర్మ, సౌరభ్ దూబే వంటి నటులు నటించారు.
క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్
పంకజ్ త్రిపాఠి సిరీస్ క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు 7.7 ఐఎండీబీ రేటింగ్ ఉంది. జీషాన్ అయూబ్, సుర్వీన్ చావ్లా ఈ సిరీస్ లో కనిపించారు. ఇది లీగల్ డ్రామా సిరీస్. జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.
ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్
ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ తో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. 7.6 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
ది వాకింగ్ ఆఫ్ ఎ నేషన్
ది వాకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఇది చారిత్రక డ్రామా థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ లో తారుక్ రైనా కనిపించాడు. ఈ సిరీస్ కు 7.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్
ఖాకీ: ఖాకీ ది బెంగాల్ చాప్టర్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ ను నీరజ్ పాండే రూపొందించారు. మీరు దీన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. దీని ఐఎండీబీ రేటింగ్ 7.5 ఉంది.
టూ వీలర్
అమెజాన్ ప్రైమ్ వీడియో కామెడీ సిరీస్ టూ వీలర్ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సిరీస్ కు 7.4 రేటింగ్ ఉంది. ఇదొక కామెడీ వెబ్ సిరీస్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


