Deepika Padukone: మళ్లీ తల్లి కాబోతున్న దీపికా పదుకొణె- కూతురు చేతులతో రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన- దువాకు తోడుగా చిన్నారి
Deepika Padukone Pregnancy Second Time: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ గారాల పట్టి 'దువా'కు తోడుగా మరో చిన్నారి రాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన పోస్ట్‌తో వెల్లడించారు. దీంతో ఈ జంటకు విషెస్ అందుతున్నాయి.
Deepika Padukone Announces Second Pregnancy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతుంది. తాజాగా తన రెండో ప్రెగ్నెన్సీని అత్యంత క్యూట్‌గా ప్రకటించింది రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె జంట. ఆదివారం (ఏప్రిల్ 19) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అరుదైన చిత్రాన్ని షేర్ చేస్తూ అభిమానులకు తీపి కబురు చెప్పింది దీపిక.

'దువా' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్
ఆ ఫొటోలో కూతురు 'దువా' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో రెండు స్పష్టమైన పింక్ లైన్లు కనిపిస్తున్నాయి. అంటే దువా ఇప్పుడు 'అక్క' కాబోతుందన్నమాట. ఈ ఫొటోలో దీపికా, రణ్‌వీర్ చేతులు తమ కూతురిని అక్కున చేర్చుకున్నట్లుగా ఉండటం చూస్తుంటే ఆ కుటుంబంలో సంతోషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం 'దిష్టి చుక్క' (Evil Eye) ఎమోజీలతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.
బాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు
కూతురు దువా పదుకొణెతో తన రెండో ప్రెగ్నెన్సీ న్యూస్‌ను వినూత్నంగా, క్యూట్‌గా ప్రకటించారు దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ జంట. ఈ వార్త బయటకు రాగానే నెట్టింట అభిమానుల కోలాహలం మొదలైంది. టాలీవుడ్ నుంచి సమంత రూత్ ప్రభు రెడ్ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను చాటగా, పరిణీతి చోప్రా తదితర సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
"దువాకు తోడు దొరుకుతోంది", "మరో మినీ దీపికా రాబోతుందా?" అంటూ అభిమానులు క్రేజీ కామెంట్లతో విషెస్ తెలుపుతున్నారు. "కొన్ని వార్తలు వింటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది.. ఇది అలాంటిదే" అని ఒక అభిమాని రాసుకొచ్చారు.
ఇటలీలో వివాహం.. దువాతో మొదలైన ప్రయాణం
దీపికా, రణ్‌వీర్ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత ముంబై, బెంగళూరుల్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్లు నిర్వహించారు.
2024 సెప్టెంబర్‌లో ఈ దంపతులకు మొదటి సంతానంగా 'దువా పదుకొణె' జన్మించింది. తమ ప్రార్థనలకు దేవుడు ఇచ్చిన సమాధానం (Dua) కాబట్టే ఆ పేరు పెట్టినట్లు వారు గతంలో వెల్లడించారు. గతేడాది దీపావళి సందర్భంగా దువా ముఖాన్ని పరిచయం చేయగా, ఆమె అచ్చు దీపికాలానే ఉందంటూ నెటిజన్లు ఫిదా అయ్యారు.
సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం దీపికా పదుకొణె కెరీర్ పరంగా కూడా టాప్ గేర్‌లో ఉన్నారు. షారుఖ్ ఖాన్ 'కింగ్', అల్లు అర్జున్ రాకా సినిమాల్లో దీపికా పదుకొణె హీరోయన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. కింగ్ 2026 డిసెంబర్ 24న విడుదల కానుంది.
ప్రళయ్ అనే చిత్రంలో
మరోవైపు రణ్‌వీర్ సింగ్ తన లేటెస్ట్ హిట్ 'ధురంధర్: ది రివెంజ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ధురంధర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. తదుపరి జయ్ మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటించనున్నాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


