SRK Oscar: ఆస్కార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షారుఖ్ ఖాన్ ఐకానిక్ సీన్- నేను నిజంగా వరల్డ్ కింగ్‌లా ఫీలవుతున్నా అన్న బాద్‌షా!

Shah Rukh Khan Reacts To Oscars Instagram Post: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ క్రేజ్ ఖండంతరాలు దాటింది. తాజాగా ప్రతిష్టాత్మక అస్కార్ అకాడమీ సంస్థ షారుఖ్ నటించిన 'ఓం శాంతి ఓం' చిత్రంలోని ఒక ఐకానిక్ సీన్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. దీనిపై స్పందించిన షారుఖ్ ఇంట్రెస్టింగ్ నోట్ రాశాడు.

Published on: Apr 18, 2026, 10:10:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shah Rukh Khan About Oscars Instagram Post: సినిమా ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే అస్కార్ అవార్డులను అందించే 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్', తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్ అవార్డు అందుకున్న తర్వాత చెప్పే సుప్రసిద్ధ డైలాగ్ ఉంది.

ఆస్కార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షారుఖ్ ఖాన్ ఐకానిక్ సీన్- నేను నిజంగా వరల్డ్ కింగ్‌లా ఫీలవుతున్నా అన్న బాద్‌షా!
ఆస్కార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షారుఖ్ ఖాన్ ఐకానిక్ సీన్- నేను నిజంగా వరల్డ్ కింగ్‌లా ఫీలవుతున్నా అన్న బాద్‌షా!

మనకు దక్కేలా కుట్ర చేస్తుంది

"ఒక విషయాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఈ సృష్టి మొత్తం అది మనకు దక్కేలా కుట్ర చేస్తుంది" అనే అర్థం వచ్చేలా ఉన్న హిందీ డైలాగ్‌ను షారుఖ్ ఖాన్ చెప్పాడు. దాన్ని అకాడమీ షేర్ చేస్తూ, "విధి అనేది ఎప్పుడూ గురి తప్పదు" అని క్యాప్షన్ ఇచ్చింది.

దీనిపై షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "మరోసారి నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను నిజంగా ఈ ప్రపంచానికే రాజులా (King of the World) ఫీలవుతున్నాను" అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఫరా ఖాన్ రియాక్షన్: "పిక్చర్ అభి బాకీ హై"

ఓం శాంతి ఓం దర్శకురాలు ఫరా ఖాన్ కూడా ఈ అరుదైన గౌరవం పట్ల స్పందించారు. ఈ పోస్ట్‌ను తనకు పంపిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే, సినిమాలోని తన ఫేవరెట్ డైలాగ్ "పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు ఫరా ఖాన్.

2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, దీపికా పదుకొణెను వెండితెరకు పరిచయం చేసింది. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటికీ ప్రేక్షకులకు ఆల్‌టైమ్ ఫేవరెట్.

కింగ్ ఖాన్ తదుపరి ప్రయాణం.. కూతురితో కలిసి!

ఇదిలా ఉంటే, ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న 'కింగ్' సినిమాలో షారుఖ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. షారుఖ్ తనయురాలు సుహానా ఖాన్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కానుంది. వీరికి తోడుగా అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.

మరోవైపు, హిట్ కాంబినేషన్ అయిన ఫరా ఖాన్ - షారుఖ్ ఖాన్ మళ్లీ జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

షారుఖ్ ఖాన్ షేర్ చేసిన ఆస్కార్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
షారుఖ్ ఖాన్ షేర్ చేసిన ఆస్కార్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More