సినిమా సెట్స్‌లో ఎఫైర్లు.. అసలు కారణం చెప్పేసిన ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్.. ఇంతకీ ఏంటంటే? చంకీ పాండే షర్ట్ ఆమె దగ్గరే!

ఒక చాట్ షోలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్.. సినిమా సెట్స్ లో అఫైర్స్ గురించి మాట్లాడారు. తన నటన అనుభవంతో పాటు, ఫిల్మ్ సెట్స్‌లో నటీనటుల మధ్య ఉండే సంబంధాలపై కామెంట్లు చేశారు. అలాగే చంకీ పాండే షర్ట్ తన దగ్గర ఉన్న విషయాన్ని కూడా వెల్లడించారు. 

Published on: Nov 06, 2025 11:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొరియోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్ ఫరా ఖాన్ తన తెలివి, సృజనాత్మకత, దర్శకత్వానికి ప్రసిద్ధి. కానీ ఆమె కొద్దికాలం పాటు యాక్టింగ్ కూడా చేశారని చాలా మందికి గుర్తుండదు. ఇటీవల ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్ట్ చేస్తున్న 'టూ మచ్' అనే చాట్ షోలో పాల్గొన్న ఫరా 2012లో 'షిరీన్ ఫర్హాద్ కీ తో నికల్ పడీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేయడం గురించి మాట్లాడారు. అలాగే సినిమా సెట్స్ లో ఎఫైర్ల గురించి కామెంట్ చేశారు.

ఫరా ఖాన్ (HT_PRINT)
ఫరా ఖాన్ (HT_PRINT)

ఎందుకు చేశానో?

నటిగా మారాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ఫరా ఖాన్ ఇలా గుర్తుచేసుకున్నారు. “నిజానికి, నేను ఆ సినిమా ఎందుకు చేశానో నాకే తెలియదు. బహుశా నేను ఫాల్తూగా (పనిలేకుండా) కూర్చున్నానేమో. అప్పుడు బోమన్ (ఇరానీ) నాకు ఫోన్ చేశాడు. సంజయ్ భన్సాలీ మా ఇంటికి వచ్చి ‘నేను ప్రతిరోజూ సెట్‌లో ఉంటాను’ అని చెప్పారు. బోమన్‌తో పనిచేయడం బాగుంది” అని ఫరా తెలిపారు.

సెట్స్ లో ఎఫైర్లు

“నేను నటిగా మారాను, కానీ ఇది నాకు అస్సలు సరిపడదని నిర్ణయించుకున్నాను. నాకు అది నచ్చలేదు, ఎందుకంటే రోజంతా ఖాళీగా కూర్చుని ఎదురుచూడాలి. సెట్స్‌లో నటీనటులకు ఎఫైర్లు ఎందుకు ఉంటాయో ఇప్పుడు నాకు అర్థమైంది. కేవలం బోర్ కొట్టడం వల్లే అలా చేస్తారేమో అని బోమన్‌తో చెప్పా!” అని ఫరా చెప్పారు.

పెద్దవాళ్లకు ప్రాక్టీస్

సెట్‌లో సంబంధాల గురించిన ఈ సంభాషణ 'టూ మచ్' షోలోని ఒక సెగ్మెంట్‌కు దారితీసింది. అక్కడ ట్వింకిల్ ఖన్నా, కాజోల్, అనన్య పాండే, ఫరా ఖాన్.. యువత కంటే పెద్దవాళ్లే తమ ఎఫైర్లను బాగా దాచిపెడతారా అనే అంశంపై చర్చించారు. ట్వింకిల్, ఫరా, అనన్య ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

ట్వింకిల్ సరదాగా “పెద్దవాళ్లే చాలా బెటర్, వాళ్లకు చాలా ప్రాక్టీస్ ఉంటుంది” అని అన్నారు. అయితే కాజోల్ దీనితో విభేదిస్తూ, “యువత తమ జీవితంలోని అన్ని విషయాలను, ఎఫైర్లతో సహా చాలా బాగా దాచిపెడతారు” అని అన్నారు. సోషల్ మీడియా యుగంలో “ఏదైనా ఎలాగూ బయటకు వచ్చేస్తుంది” అని అనన్య చెప్పింది.

చంకీ షర్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టూ మచ్ షోలోనే తన తండ్రి షర్ట్ ఎప్పుడు తిరిగిస్తారని ఫరాను అనన్య అడుగుతుంది. పాపులర్ నటుడు చంకీ పాండే కూతురే అనన్య పాండే అన్న విషయం తెలిసిందే. ఆ షర్ట్ గురించి చెప్తూ. ‘‘ఫరా ఓ సారి మా ఇంటికి వచ్చింది. అప్పుడు మా కుక్కు సరిగ్గా కళ్లు కనిపించలేదు. ఇంట్లో ఎక్కడంటే అక్కడే మూత్రం పోసేది. ఫోన్లో మాట్లాడుతున్న ఫరా ఆ మూత్రంపై కాలు పెట్టి జారిపడింది. ఆమె డ్రెస్ పాడైపోయింది. స్నానం చేశాక మా నాన్న షర్ట్ వేసుకుంది’’ అని అనన్య వెల్లడించింది.

షోపై కాంట్రవర్సీ

గతంలో ఇదే షోలో, ట్వింకిల్ ఖన్నా, కాజోల్, కరణ్ జోహార్, జాన్వీ కపూర్ మధ్య జరిగిన మరో చర్చ వైరల్ అయింది. సంబంధంలో ఫిజికల్ చీటింగ్, ఎమోషనల్ ఇన్ఫిడెలిటీలో ఏది పెద్ద డీల్ బ్రేకర్ అనే దానిపై వారు చర్చించారు. ట్వింకిల్, కాజోల్, కరణ్ “రాత్ గయీ, బాత్ గయీ” (రాత్రి గడిచింది, విషయం ముగిసింది) అంటూ ఫిజికల్ ఇన్ఫిడెలిటీని తేలికగా తీసుకుంటే, జాన్వీ కపూర్ మాత్రం, “లేదు, ఆ డీల్ బ్రేక్ అయినట్టే” అని గట్టిగా చెప్పారు.

కరణ్ “థండ్ లగ్ జాతీ హై కభీ కభీ” (అప్పుడప్పుడు చలి వేస్తుంది) అంటూ ఫిజికల్ తప్పులను సమర్థించడానికి ప్రయత్నించగా, జాన్వీ వెంటనే, “నహీ, నహీ లగ్నీ చాహియే నా! బ్లాంకెట్ లగాదో!” (లేదు, చలి వేయకూడదు కదా! దుప్పటి కప్పుకోండి!) అని చమత్కరించారు. దీనికి ట్వింకిల్ నవ్వుతూ “మాకు 50 ఏళ్లు! ఆమెకు 20 ఏళ్లే, త్వరలోనే ఆమె కూడా మా సర్కిల్‌లోకి వస్తుంది” అని ఆటపట్టించారు.

News/Entertainment/సినిమా సెట్స్‌లో ఎఫైర్లు.. అసలు కారణం చెప్పేసిన ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్.. ఇంతకీ ఏంటంటే? చంకీ పాండే షర్ట్ ఆమె దగ్గరే!
News/Entertainment/సినిమా సెట్స్‌లో ఎఫైర్లు.. అసలు కారణం చెప్పేసిన ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్.. ఇంతకీ ఏంటంటే? చంకీ పాండే షర్ట్ ఆమె దగ్గరే!