Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు- సైబర్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు- ఆ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచే!

Lavanya Tripathi Files Cyber Crime Complaint: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నారంటూ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆమె ఫిర్యాదు చేశారు.

Published on: Mar 10, 2026, 12:42:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (లావణ్య కొణిదెల)కి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో సైబర్ వేధింపులపై లావణ్య గళమెత్తారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు.

మెగా కోడలికి వేధింపులు- సైబర్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు- ఆ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచే!
మెగా కోడలికి వేధింపులు- సైబర్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు- ఆ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచే!

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి

ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఒక నిర్దిష్ట ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కుటుంబాన్ని లాగుతూ అసభ్యకర పోస్టులు

తన ఫిర్యాదులో లావణ్య పలు కీలక విషయాలను ప్రస్తావించారు. సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ సభ్యుల గురించి కూడా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుల వల్ల తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానని, తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆమె పోలీసులకు వివరించారు.

రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు

లావణ్య త్రిపాఠి ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు వెంటనే స్పందించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు.

ఎవరు నిర్వహిస్తున్నారు

ఆ వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు? ఆ పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు మొదలుపెట్టారు. డిజిటల్ ఆధారాల సాయంతో నిందితులను త్వరలోనే గుర్తిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 6న రిలీజ్ కావాల్సింది

ఇక కెరీర్ విషయానికి వస్తే.. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘సతి లీలావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి 6, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సతి లీలావతి మూవీ విడుదల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా

అలాగే, సతి లీలావతి సినిమాలో దేవ్ మోహన్ హీరోగా చేస్తున్నాడు. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. భార్యా భర్తల మధ్య సాగే కథగా ఈ మూవీ రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More