SCR Summer Special Trains : చర్లపల్లి నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు - తాజా లిస్ట్ ఇదిగో

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి మే 3, 2026 మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

Published on: Apr 20, 2026 1:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి (Charlapalli) రైల్వే స్టేషన్ నుంచి జసిదిహ్, ముజఫర్‌పూర్, బరౌనీ వంటి ప్రధాన నగరాలకు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్ల వివరాలు:

ఈ ప్రత్యేక సర్వీసులు ఏప్రిల్ 23 నుంచి మే 3, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రైలు కేవలం ఒక సర్వీసును మాత్రమే అందిస్తుంది.

  • చర్లపల్లి - జసిదిహ్ (Jasidih): చర్లపల్లి(రైలు నంబర్లు 07580, 07586) నుంచి గురువారాల్లో (ఏప్రిల్ 23, 30) బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో జసిదిహ్ - చర్లపల్లి (07581, 07587) రైళ్లు శుక్రవారాల్లో నడుస్తాయి.
  • చర్లపల్లి - ముజఫర్‌పూర్ (Muzaffarpur): చర్లపల్లి(రైలు నంబర్లు 07582, 07584,07590) నుంచి వివిధ తేదీల్లో (ఏప్రిల్ 28, ఏప్రిల్ 24 మరియు మే 01) బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో ముజఫర్‌పూర్ - చర్లపల్లి (07583, 07585, 07591) రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
  • చర్లపల్లి - బరౌనీ: ఏప్రిల్ 26వ తేదీన చర్లపల్లి(రైలు నంబర్ 07588) నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో బరౌనీ - చర్లపల్లి (07589) రైలు ఏప్రిల్ 28న నడుస్తుంది.

ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20, 2026 ఉదయం 08:00 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More