తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్... చర్లపల్లి - నర్సాపూర్ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్, హాల్టింగ్ లిస్ట్ ఇదే

Charlapalli Narasapur Weekly Express Trains : చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీస్… తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగనుంది.

Published on: Apr 18, 2026 3:33 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Charlapalli Narasapur Weekly Express Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి - నర్సాపూర్ మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రకటించింది. ఈ ట్రైన్( 17061/17062)… ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

ట్రైన్​ టికెట్​ ధరల పెంపు..
ట్రైన్​ టికెట్​ ధరల పెంపు..

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం, ఈ కొత్త సర్వీసులను వేర్వేరు తేదీల్లో ప్రారంభించనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి…

  • రైలు నంబర్ 17062 (నర్సాపూర్ - చర్లపల్లి): ఈ రైలు ఏప్రిల్ 26, 2026 (ఆదివారం)వ తేదీన నర్సాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం రాత్రి 20:00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి….. మరుసటి రోజు సోమవారం ఉదయం 07:50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 17061 (చర్లపల్లి - నర్సాపూర్): ఈ రైలు మే 2, 2026 (శనివారం) నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి శనివారం రాత్రి 19:50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. ఆదివారం ఉదయం 07:00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు….

వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో అన్ని రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General) కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు తమ బడ్జెట్ మరియు సౌకర్యానికి అనుగుణంగా బెర్తులను బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సూచింది.

సెలవు రోజులతో పాటు పండగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు మరియు విద్యార్థులకు ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More