SCR Special Trains : ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అప్డేట్ - చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు..! షెడ్యూల్ వివరాలు

South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే 12 సమ్మర్ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - సంత్రాగచి, తాంబరం - న్యూ తిన్సుకియా మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.

Published on: Apr 11, 2026 3:27 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Central Railway Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పెంచటంతో పాటు గతంలో ప్రకటించిన వాటిని కూడా పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో 12 వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లితో పాటు ఇతర స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ వివరాలు:

చర్లపల్లి - సంత్రాగచి - చర్లపల్లి (06 సర్వీసులు): చర్లపల్లి - సంత్రాగచి(రైలు నంబరు 07517 ) ఏప్రిల్ 15, 19 ,23 తేదీల్లో ప్రత్యేక రైలుంటాయి. ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 14:30 గంటలకు సంత్రాగచికి చేరుకుంటుంది.

మరోవైపు సంత్రాగచి - చర్లపల్లి(రైలు నంబరు 07518 ) మధ్య ఏప్రిల్ 16, 20 ,24 తేదీల్లో కూడా స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. సాయంత్రం 16:45 గంటలకు సంత్రాగచి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 22:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు…. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

తాంబరం - న్యూ తిన్సుకియా - తాంబరం (06 సర్వీసులు): తాంబరం - న్యూ తిన్సుకియా(రైలు నంబరు 06015) మధ్య ఏప్రిల్ 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లుంటాయి. ఉదయం 10:15 గంటలకు బయలుదేరి 3వ రోజు తెల్లవారుజామున 04:30 గంటలకు న్యూ తిన్సుకియాకు చేరుకుంటుంది.

న్యూ తిన్సుకియా - తాంబరం(రైలు నంబరు 06016 ) మధ్య ఏప్రిల్ 16, 23, 30 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. రాత్రి 20:00 గంటలకు బయలుదేరి 3వ రోజు సాయంత్రం 16:00 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, డాన్కుని, బర్ధమాన్, రాంపూర్ హాట్, మాల్దా టౌన్, బార్సోయ్, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గువహటి, చాపర్‌ముఖ్, లమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కాటింగ్ స్టేషన్లలో ఆగుతాయి.

ఈ రైళ్లలో కేవలం స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More