IRCTC Tour Package : విజయవాడ టు తమిళనాడు - ఈ ప్రముఖ ఆలయాలన్నీ చూడొచ్చు..! లిస్టులో కొడైకెనాల్
తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఏపీలోని విజయవాడ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
ఈ వేసవి వేళ చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చూసేందుకు విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.

ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం… ఈ ప్యాకేజీని తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్ EX విజయవాడ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో బుకింగ్ చేసుకోవాలి. ఆసక్తి గల వాళ్లు… టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ ట్రిప్ 6 రోజులు ఉంటుంది. తంజావూర్, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్ వంటి పలు ప్రాంతాలను సందర్శిస్తారు. మొదటి రోజు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి… తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం శ్రీనగరం ఆలయాన్నిదర్శించుకుంటారు. రాత్రికి తిరుచ్చిలోనే ఉంటారు.
- రెండో రోజు హోటల్‌లో అల్పాహారం ముగించుకుని… తంజావూరుకు (60 కి.మీ) ప్రయాణమవుతారు. ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం (Brihadeeswara Temple) సందర్శన ఉంటుంది. తంజావూరు నుండి రామేశ్వరానికి (240 కి.మీ) ప్రయాణం ఉంటుంది. రామేశ్వరం చేరుకుని హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు., డిన్నర్ ముగించుకుని ఇక్కడే బస చేస్తారు.
- మూడో రోజు హోటల్‌లో అల్పాహారం ఉంటుంది. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి, స్థానిక దేవాలయాలను చూస్తారు. రాత్రి భోజనం మరియు రామేశ్వరంలో బస.
- నాల్గో రోజు టిఫిన్ చేసిన తర్వాత మదురైకి (180 కి.మీ) వెళ్తారు. ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడైకెనాల్‌కు (120 కి.మీ) బయలుదేరుతారు.
- ఐదో రోజు కొడైకెనాల్‌లోని స్థానిక పర్యాటక ప్రాంతాలను (బ్రయంట్ పార్క్, గుణ గుహలు, పైన్ ఫారెస్ట్, పిల్లర్ రాక్, కొడై లేక్) చూస్తారు. రాత్రి కొడైకెనాల్ లోనే ఉంటారు.
- చివరి రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి మదురైకి (120 కి.మీ) ప్రయాణవుతారు. సాయంత్రం వరకు విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. ₹51050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 37900, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 36300గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9281030714 నెంబర్ ను సంప్రదించవచ్చు. టికెట్ల బుకింగ్ తో పాటు ఇతర వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











