Srikakulam - Tirupati Train : నెరవేరిన 75 ఏళ్ల కల..! ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్, టైమింగ్స్ ఇవే

Srikakulam - Tirupati Humsafar Express Train : ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తిరుపతికి వెళ్లేందుకు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ఈ మేరకు ముహుర్తం ఫిక్స్ అయింది. కొత్త సర్వీసుతో శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లొచ్చు.

Published on: Apr 10, 2026 1:52 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Srikakulam - Tirupati Humsafar Express Train : ఉత్తరాంధ్ర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. తిరుపతి - శ్రీకాకుళం రోడ్ - తిరుపతి మధ్య హంసఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 17439 / 17440) పట్టాలెక్కనుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ గా ప్రయాణించే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభం కానుంది.

శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి రెగ్యులర్ ట్రైన్
శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి రెగ్యులర్ ట్రైన్

ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఉత్తరాంధ్ర భక్తులతో పాటు… పలు పనుల నిమిత్తం ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.రెండు రైళ్లు మారాల్సిన ఇబ్బందులు లేకుండానే… ఇక నేరుగా తిరుపతికి చేరుకోవచ్చు.

ప్రయాణ తేదీలు - వివరాలు

  • దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… ఈ రైలు వారానికి ఒకసారి చొప్పున ప్రయాణిస్తుంది.
  • శ్రీకాకుళం రోడ్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 17440 ): ఈ రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13, 2026 నుంచి ప్రారంభమవుతుంది.
  • తిరుపతి - శ్రీకాకుళం రోడ్ ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 17439 ): ఈ రెగ్యులర్ ట్రైన్ సర్వీస్ ఏప్రిల్ 19, 2026 నుంచి మొదలవుతుంది.

తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం 16.55 గంటలకు బయలుదేరే రైలు.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి సోమవారం మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి.. మంగళవారం ఉదయం 08.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.దీని వల్ల శ్రీకాకుళం ప్రయాణికులు ఇకపై విశాఖ వెళ్లి తిరుపతి రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదు. నేరుగానే తిరుపతికి చేరుకోవచ్చు.

ఈ రైలులో థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లు మాత్రమే ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ కోచ్‌ల విభజన జరిగింది. సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

దీర్ఘకాలిక కోరిక నెరవేరింది - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఈ కొత్త సర్వీసుతో శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రాహ్మోన్ నాయుడు అన్నారు. "75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగించనుంది. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి రైలును ప్రారంభించనున్నాము. ఈ రైలు సర్వీస్ ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఓ ప్రకటన విడుదల చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More