తిరుపతి - కొల్హాపూర్ ట్రైన్ అప్డేట్ : ఏపీలో మరో స్టాపేజీ - ఎక్కడంటే...?

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. తిరుపతి - కొల్హాపూర్ మధ్య నడిచే ట్రైన్ ఇకపై కడపలోని నందలూరు రైల్వే స్టేషన్ లో ఆగనుంది.

Published on: Mar 18, 2026 8:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.తిరుపతి – కొల్హాపూర్ - తిరుపతి మధ్య నడిచే ట్రైన్… ఇకపై కడప జిల్లాలోని నందలూరు రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రైల్వే ప్రయాణికులకు అప్డేట్
రైల్వే ప్రయాణికులకు అప్డేట్

కొత్త స్టాపేజీ…

తిరుపతి - కొల్హాపూర్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17415 ) కడప జిల్లాలని నందలూరు స్టేషన్లో ఆగుతుంది. అంతేకాకుండా కొల్హాపూర్ - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17416) రైలు కూడా ఈ స్టేషన్ లో ఆగనుంది. ప్రయోగత్మకంగా ఈ స్టాపేజీ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

ఈ కొత్త స్టాపేజీ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆరు నెలల పాటు ఈ స్టాపేజీ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తిరుపతితో పాటు మహారాష్ట్రకు వెళ్లే స్థానిక ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

తిరుపతి - కొల్హాపూర్ ట్రైన్ రాత్రి 09.30 గంటలకు బయల్దేరి… మరునాడు సాయంత్రం 04.35 నిమిషాలకు కొల్హాపూర్ కు చేరుతుంది. కొత్తగా స్టాపేజీగా ఉన్న నందలూరు రైల్వే స్టేషన్ కు రాత్రి 10.58 నిమిషాలకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు అక్కడ్నుంచి బయల్దేరుతుంది.

ఇక కొల్హాపూర్ నుంచి తిరుపతి వచ్చే ట్రైన్…. ఉదయం 11. 50 నిమిషాలకు బయల్దేరి… మరునాడు ఉదయం 08.15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా నందలూరు రైల్వే స్టేషన్ లో 2 నిమిషాలపాటు ఆగుతుంది.

ఈ ట్రైన్స్… తిరుపతి, రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు,హోసిపేట్, మునిరాబాద్, హుబ్లీ, దర్వార్, ఖానాపూర్, బెల్గావి, రాయ్ బాగ్, మిరాజ్ జంక్షన్, కొల్హాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More