ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.... ఇక రెగ్యులర్ సర్వీసుగా విశాఖ - తిరుపతి ట్రైన్..! తాజా అప్డేట్స్ ఇవే

ఏపీ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే స్పెషల్ రైలును రెగ్యూలర్ సర్వీస్ గా క్రమబద్ధీకరించారు.

Published on: Mar 17, 2026, 15:40:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యూలర్ సర్వీసుగా క్రమబద్ధీకరించారు. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

విశాఖ - తిరుపతి ట్రైన్ రెగ్యులర్ సర్వీసుగా మార్పు
విశాఖ - తిరుపతి ట్రైన్ రెగ్యులర్ సర్వీసుగా మార్పు

రెగ్యూలర్ సర్వీసుగా మార్పు…

విశాఖపట్నం - తిరుపతి( 08547/08548) మధ్య స్పెషల్ ట్రైన్ నడుస్తోంది. ఇకపై ఈ ట్రైన్ రెగ్యూలర్ ట్రైన్ గా సేవలు అందించనుంది. దీంతో ఈ ట్రైన్ నెంబర్ ను 18505/18506 గా మార్పు చేశారు.

విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18505) బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక తిరుపతి - విశాఖపట్నం(18506) మధ్య నడిచే ట్రైన్ గురువారం రాత్రి 21:50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు 13:30 నిమిషాలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే…

ఈ రెగ్యూలర్ ట్రైన్…. అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. వారానికి ఒకసారి (బుధవారం విశాఖపట్నం నుండి / గురువారం తిరుపతి నుండి) మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే ఈ రెగ్యూలర్ ట్రైన్ లో 2 లగేజీ, గార్డ్ వ్యాన్లు, 04 జనరల్, 09 స్లీపర్ క్లాస్, 04 థర్డ్ ఏసీ (3rd AC), మరియు 03 సెకండ్ ఏసీ (2nd AC) కోచ్‌లుంటాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More