Vizag Metro : విశాఖపట్నం మెట్రో రైలుపై అప్డేట్.. కనెక్టివిటీతో ట్రాఫిక్ సమస్యలకు చెక్!
visakhapatnam metro rail : విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో నాలుగు కారిడార్లను వేయనున్నట్లు APMRCL మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనితో ట్రాఫిక్ సమస్యలు మెరుగుపడనున్నట్టుగా చెప్పారు.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా 76.70 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లను వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది నగర దీర్ఘకాలిక రవాణా అవసరాలను తీరుస్తుందని అన్నారు. సీఐఐ విజయవాడ వార్షిక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. జాతీయ రహదారి-16 వెంట ప్రతిపాదించిన విశాఖపట్నం మెట్రో-కమ్-ఫోర్ లేన్ రోడ్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ మెట్రో మౌలిక సదుపాయాలను రోడ్డు రవాణాతో అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని మెరుగుపరుస్తుందని రామకృష్ణారెడ్డి అన్నారు.

'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) విశాఖపట్నం గుండా వెళ్ళే NH-16 వెంట వివిధ జంక్షన్లలో 12 ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. తద్వారా సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగుతాయి.' అని మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ తెలిపారు.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో 66.20 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న మూడు కారిడార్లను జాతీయ రహదారి ఫ్లైఓవర్ల వెంట ప్రణాళిక చేయడం వల్ల విజయవాడకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని రైల్వే బోర్డు అదనపు సభ్యుడు(ట్రాఫిక్) దేవేంద్ర కుమార్ నొక్కి చెప్పారు. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందన్నారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన, హై స్పీడ్ ప్రయాణ సౌకర్యాలను అందిస్తోందన్నారు.
మచిలీపట్నం రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్, డివిజన్‌లోని రైల్వే వంతెనలను బలోపేతం చేయడం వంటి కొనసాగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా హైలైట్ చేశారు. రైలు, రోడ్డు, ఓడరేవు కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు రవాణా ఖర్చులను తగ్గించడంలో, రోడ్ల రద్దీని తగ్గించడంలో, స్థిరమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని సోనాకియా అన్నారు.
రాష్ట్రంలో సమీకృత రైలు, ఓడరేవు, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ దక్షిణ భారతదేశం నుండి ఎగుమతులను మెరుగుపరుస్తుందని సీఐఐ విజయవాడ చైర్‌పర్సన్ వి.నాగలక్ష్మి అన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ వంటి ప్రధాన ఓడరేవులతో ఎగుమతి ఆధారిత వృద్ధికి ఆంధ్రప్రదేశ్ మంచి ప్రయోజనాన్ని కలిగి ఉందన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


