వైజాగ్ వాసులకు అదిరిపోయే న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విశాఖ నగర వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వైజాగ్ రూపురేఖలు మారనున్నాయి.
వైజాగ్‌కు మెట్రో వచ్చేస్తోంది. కేంద్రం నుంచి మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో విశాఖలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కి కంప్లీట్ అయితే బీచ్ సిటీలో ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. వైజాగ్, విజయవాడంలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్రం పంపింది. మెుదట వైజాగ్‌లో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీబిజీగా ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టుతో సహా కీలకమైన నీటిపారుదల, నీటి భద్రతా ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతం చేయాలని, ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడటానికి, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు సకాలంలో కేంద్ర మద్దతు చాలా కీలకమని చంద్రబాబు అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, జాతీయ ప్రాజెక్టులలో వ్యయాల పెరుగుదల, దీర్ఘకాలంగా ఉన్న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై కేంద్రమంత్రితో చర్చించారు.
పోలవరం ప్రాజెక్టుపై విధించిన స్టాప్-వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పోలవరం దశ II కోసం పూర్తి కేంద్ర నిధులను అభ్యర్థించారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసిత కుటుంబాల పునరావాసం, రక్షిత కట్టల నిర్మాణంతో కూడిన రెండో దశకు దాదాపు రూ.32,000 కోట్ల అదనపు కేటాయింపులు అవసరమని అన్నారు.
గోదావరి వరద నీటిని ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత ప్రాంతాలకు మళ్లించడం లక్ష్యంగా ప్రతిపాదిత పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆమోదాలు, మద్దతు గురించి కేంద్రమంత్రితో చంద్రబాబు మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ తాగునీరు, నీటిపారుదల, పారిశ్రామిక అవసరాలను తీరుస్తుందని అన్నారు. జాతీయ నదుల అనుసంధాన విధానం కింద సాంకేతిక, ఆర్థిక మద్దతును ఆయన కోరారు.
గోదావరి జలాల పంపకంపై తెలంగాణతో కొనసాగుతున్న విభేదాలను చంద్రబాబు ఎత్తి చూపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమాన కేటాయింపు జరిగేలా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచాలనే కర్ణాటక ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యతపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


