SCR Summer Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ - ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు..!
SCR Summer Special Trains 2026 : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సంత్రాగచ్చి, షాలిమార్, నాగర్‌కోయిల్, చెన్నై వైపు వెళ్లే ప్రయాణికుల కోసం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ మీదుగా వెళ్తాయి.
SCR Summer Special Trains 2026 : వేసవి కాలం వచ్చిందంటే చాలు రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో… చాలా మంది సొంతూళ్లకు వెళ్లటం లేదా పర్యాటక ప్రాంతాలకు పయనమవుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఈ అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రూట్లలో 'సమ్మర్ స్పెషల్' రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ప్రత్యేక రైళ్లు - రూట్లు, ఆగే స్టేషన్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. .. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి (06073) మధ్య రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఏప్రిల్ 20 మరియు 27 తేదీలలో (సోమవారం) రాత్రి 23:45 గంటలకు చెన్నైలో బయలుదేరి, బుధవారం ఉదయం 07:45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి - చెన్నై బీచ్ (06074) రైలు ఏప్రిల్ 22 మరియు 29 తేదీలలో (బుధవారం) ఉదయం 10:45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 19:30 గంటలకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏపీలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ , పలాస వంటి స్టేషన్లలో ఆగుతాయి.ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లుంటాయి.
మరోవైపు నాగర్‌కోయిల్ - షాలిమార్ - నాగర్‌కోయిల్ (06057/06058) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. నాగర్‌కోయిల్ నుంచి ఏప్రిల్ 15న ఉదయం 11:40 గంటలకు బయలుదేరే రైలు శుక్రవారం మధ్యాహ్నం 14:30 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమార్ నుంచి ఏప్రిల్ 18న మధ్యాహ్నం 14:00 గంటలకు బయలుదేరి సోమవారం సాయంత్రం 17:30 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు కూడా రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.
టికెట్లు కోరుకునే వారు అధికారిక వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) యాప్ ద్వారా ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

