చెన్నై, ముంబై, కోల్‌కతాకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో స్టాప్‌లు ఇవి!
దక్షిణ మధ్య రైల్వే (SCR) డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. చెన్నై, ముంబై, కోల్‌కతాలోని షాలిమార్‌లకు షెడ్యూల్ చేసింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చెన్నై, ముంబై, కోల్‌కతాకు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

రైలు నంబర్ 07146 సికింద్రాబాద్-చెన్నై ఎగ్మోర్ రైలు డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం 6.40కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 07147 చెన్నై ఎగ్మోర్-సికింద్రాబాద్ రైలు డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి.. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రూట్‌లో ట్రైన్ కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురులో ఆగుతుంది.
రైలు నంబర్ 07150 హైదరాబాద్ - ముంబై LTT ప్రత్యేక రైలు డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబై LTT చేరుకుంటుంది. డిసెంబర్ 7 వ తేదీన ముంబయి నుంచి రాత్రి 11.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.10కి హైదరాబాద్ చేరుకుంటుంది
ఈ ట్రైన్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, హెచ్ఎస్ నాందేడ్, పూర్ణ, జల్నా, ఛత్రపతి శంభాజీ నగర్, మన్మఢ్, నాసిక్ రోడ్, కల్యాన్ స్టేషన్లలో స్టాప్ ఉంది.
రైలు నంబర్ 07148 చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైలు డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు షాలిమార్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి.. చర్లపల్లికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్కోట్, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బెర్హంపూర్, ఖుద్రా రోడ్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 06019 చెన్నై ఎగ్మోర్ - చర్లపల్లికి డిసెంబర్ 6 (శనివారం) రాత్రి 11.55కి బయలుదేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చర్లప్లికి చేరుకుంటుంది. చర్లపల్లి నుంచి 06020 ట్రైన్ చెన్నైకి డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు 8.30కి చేరుకుంటుంది.
రైలు నంబర్ 06259 యశ్వంత్‌పూర్-నిజాముద్దీన్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు చేరుకుంటుంది. 06260 ట్రైన్ నిజాముద్దీన్-బెంగళూరు ట్రైన్ డిసెంబర్ 9వ తేదీన రాత్రి 11.50 బయలుదేరి.. గురువారం రాత్రి 7.45కి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ యెల్హంక, ధర్మవరం, అనంతపూర్, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, బల్హర్ష, నాగ్‌పూర్, బోపాల్, బినా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మథూర స్టేషన్లలు ఆగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


