కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ దగ్గర రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

Published on: Nov 29, 2025, 09:22:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు పరిధిలోని కోటేకల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి మృతి

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ కు చెందిన పలువురు మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కోటేకల్ దగ్గర ఎదురుగా వస్తున్న మరో కారు…. వీరు ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టడంతో… ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కోలార్‌ జిల్లాలోని చిన్న హోసపల్లికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీ లు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. మృతి చెందిన ఐదుగురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలియచేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More