త్వరలో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం - పనుల పూర్తికి డెడ్ లైన్..!
త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవన పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

మార్చి 31లోపు పూర్తి చేయాలి - కేంద్రమంత్రి
నూతన టెర్మినల్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మార్చి 31లోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి… అనంతరం మినాశ్రయంతో పాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులతో నిర్మాణ పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నూతన టెర్మినల్ భవనం ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
విమానాశ్రయ ప్రాంగణంలో “ఏక్ పెడ్ మా కే నామ్ సే” కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మొక్కను నాటారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా…. గోదావరి ప్రాంత ప్రజలకు గేట్‌వేగా మారేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ఈ నూతన టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. త్వరలో రాజమండ్రికి మరిన్ని విమాన సర్వీసులు కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

