Sign in

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇరుముడితో విమాన ప్రయాణానికి కేంద్రం అనుమతి

విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానాయాన శాఖ శుభవార్త చెప్పింది. దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

Published on: Nov 28, 2025, 16:32:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుముడి తీసుకెళ్లే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వెళ్లే స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం (image source  (AISATS))
భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం (image source (AISATS))

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

“మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి ఉండేది. ఫలితంగా అయ్యప్ప భక్తులు అసౌకర్యానికి గురయ్యేవారు. అయ్యప్ప భక్తుల విజ్ఞప్తుల నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన విమానాయానశాఖ… ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రత్యేక సడలింపు నవంబర్ 28వ తేదీ నుంచి నుంచి జనవరి 20 వరకు అమల్లో ఉండనుంది. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు…. ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకెళ్లొచ్చు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More