మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా.. ఆరు స్టేషన్లు, 70 వంతెనలు

కృష్ణా, గుంటూరు ప్రజలకు గుడ్‌న్యూస్. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆరు స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలతో ఈ ప్రాజెక్ట్ రానుంది.

Published on: May 13, 2026, 16:56:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రూ. 2,816 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా లభించిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుండి గుంటూరు జిల్లాలోని రేపల్లె వరకు విస్తరించి ఉన్న ఈ 47.60 కిలోమీటర్ల కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు త్వరలో లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు

ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలశౌరి తెలిపారు. తుది స్థల సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆధునిక విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థలతో నిర్మిస్తారని ఎంపీ తెలిపారు.

'తుది స్థల సర్వే పూర్తయింది. రైల్వే బోర్డు ఆమోదంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశాం. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆధునిక విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థలతో నిర్మిస్తారు.' అని మచిలీపట్నం ఎంపీ తెలిపారు.

తిరుపతి-ఓఖా

తిరుపతి నుంచి గుజరాత్‌లోని ద్వారకా సమీపంలో ఉన్న ఓఖా వరకు కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ... తిరుపతి-ఓఖా-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 19559/19560) రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

రైలు నంబరు 19559 (తిరుపతి - ఓఖా): ఈ రైలు ప్రతి గురువారం తిరుపతిలో బయలుదేరుతుంది. మే 14, 2026 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

రైలు నంబరు 19560 (ఓఖా - తిరుపతి): ఈ రైలు ప్రతి సోమవారం ఓఖాలో బయలుదేరుతుంది. మే 11, 2026 నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

తిరుపతిలో గురువారం ఉదయం 08:15 గంటలకు బయలుదేరి…. శనివారం ఉదయం 11:50 గంటలకు ఓఖా చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఓఖాలో సోమవారం రాత్రి 23:55 గంటలకు బయలుదేరి, బుధవారం రాత్రి 23:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ వీక్లీ ట్రైన్స్‌ తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More