SCR Weekly Express : ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... సికింద్రాబాద్ - అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ రైలు..! టైమింగ్స్, హాల్ట
Secunderabad Anakapalle Weekly Express : సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు రానుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. మే 18 నుంచి ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
Secunderabad Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - అనకాపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకు మే 18వ తేదీని ఖరారు చేసింది.
- సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రతీ ఆదివారం నడిచేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 17043) ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది.
- సికింద్రాబాద్ లో ఆదివారం రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ రైలు…. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది.
- అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రతీ సోమవారం నడిచేలా మరో కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17044) మే 18 నుంచి అందుబాటులోకి వస్తోంది.
- అనకాపల్లిలో సోమవారం సాయంత్రం 5.35కు బయలుదేరే ఈ ఎక్స్ ప్రెస్ రైలు…. మంగళవారం ఉదయం 8.40కి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రెండు దిశల్లోనూ వారానికి ఒకసారి నడుస్తుంది.
హాల్టింగ్ లిస్ట్….
ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లోని కీలక పట్టణాలను కలుపుతూ సాగుతుంది. నల్గొండ, గుంటూరు, విజయవాడతో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు గొప్ప వెసులుబాటు కలుగుతుంది.
- చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు. భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
- ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలులో అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, 12 ధర్డ్ ఏసీ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
- వారం ప్రారంభంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నడిచేలా ఈ రైళ్ల షెడ్యూల్ ప్లాన్ చేశారు.
- తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా హాల్టింగ్ లు ఇచ్చారు. ఫలితంగా అనకాపల్లితో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు ఈ రైళ్లు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

