SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లు..! హాల్టింగ్ స్టేషన్లు ఇవే
SCR Summer Special Trains : వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. తిరుపతి - బీహార్‌లోని ఛప్రా జంక్షన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Tirupati - Chhapra Special Trains : వేసవి ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. తిరుపతి నుంచి బీహార్‌లోని ఛప్రా జంక్షన్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ వేసవిలో సొంతూళ్లకు వెళ్లేవారికి… పర్యాటకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం.

- దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. తిరుపతి నుంచి ( ట్రైన్ నెంబర్ 07443) ఛప్రా జంక్షన్ కు మే 7వ తేదీన 23:55 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. ఈ రైలు…. ఆదివారం ఉదయం 07:45 గంటలకు ఛప్రా జంక్షన్ కు చేరుతుంది.
- ఇక ఛప్రా జంక్షన్ (ట్రైన్ నెంబర్ 07444) నుంచి తిరుపతికి మే 12వ తేదీన ఉదయం 5 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఇది గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు ఇవే…
ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, డోన్, కర్నూలు సిటీ స్టేషన్లలో ఆగుతుండగా… తెలంగాణలోని గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, షాద్ నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రాపోకలు సాగిస్తాయి. హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, అకోలా, ఇటార్సీ, భోపాల్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, కాన్పూర్, లక్నో, అయోధ్య కాంట్, అయోధ్యధామ్, గోరఖ్‌పూర్ స్టేషన్లలో కూడా ఆగుతాయి.
ఈ రైలు అయోధ్యధామ్ స్టేషన్ మీదుగా వెళ్తుండటంతో,,,, శ్రీరామచంద్రుని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది సువర్ణావకాశం. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి.
వేసవిలో సాధారణ రైళ్లలో బెర్తులు దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి…. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

