SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఏపీ-తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు
SCR Special Trains : దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించనున్నాయి.
వేసవి సెలవుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విద్యాసంస్థలకు సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణ రైళ్లలో నెలకొన్న విపరీతమైన రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. తిరుమలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, కాచిగూడ, చర్లప్లి స్టేషన్ల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి. ఆ వివరాలు చూద్దాం..

మే 6వ తేదీన చర్లపల్లి-తిరుపతి మధ్య ఒక ట్రిప్ ప్రత్యేక రైలు నడవనుంది. సాయంత్రం 6.55 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
రెగ్యులర్ వీక్లీ ట్రైన్
కాకినాడ టౌన్ నుంచి హర్యానాలోని హిస్సార్‌కు కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ప్రకటించారు. కాకినాడ నుంచి మే 12వ తేదీ నుంచి ప్రతీ మంగళవారం ఈ రైలు ఉదయం 5.40కు హిస్సార్‌కు బయలుదేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిజమాబాద్, బాసర మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి హర్యానాలోని హిస్సార్‌కు ప్రతీ గురువారం చేరుకోనుంది.
అలానే హిస్సార్ నుంచి ప్రతీ శుక్రవారం కాకినాడకు ఒక ట్రైన్ బయలుదేరుతుంది. ఇది కూడా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా కాకినాడ టౌన్ స్టేషన్ కు ప్రతీ ఆదివారం వస్తుంది. మే 15వ తేదీన ఈ ట్రైన్ మెుదలుకానుంది. ఈ రెండు రైళ్లలోనూ 2 ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉండనున్నాయి.
ఉర్సు ఉత్సవాలకు స్పెషల్ రైళ్లు
నాంపల్లి నుంచి కల్బుర్గికి ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ మేరకు నాంపల్లి-కల్బుర్గి(07177/07178) ప్రత్యేక రైలు మే 2, 5 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కల్బుర్గి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 3, 6 తేదీల్లో ఉదయం 7.40 గంటలకు కల్పుర్గి నుంచి బయలుదేరుతుంది. అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లికి వస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


