నాంపల్లి ఫొరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం - TGFSL అధికారిక ప్రకటన, ఏం చెప్పిందంటే..?

తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదంపై ల్యాబొరేటరీ డైరెక్టర్‌ నుంచి ప్రకటన విడుదలైంది. చాలా వరకు కేస్ ప్రాపర్టీ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ సామగ్రి సురక్షితంగానే ఉందని ప్రకటించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Published on: Feb 08, 2026 6:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక సమాచారం కాలిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఘటనపై TGFSL డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం
ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం

TGFSL అధికారిక ప్రకటన…

TGFSL డైరెక్టర్ పేరిట విడుదలైన ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.... ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో ఓ ఉద్యోగి పొగను గమనించాడు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు స్మోక్ అలారం యాక్టివ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదం కారణంగా కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌ తో పాటు కొన్ని ఇతర సదుపాయాలకు మాత్రమే స్వల్ప నష్టం వాటిల్లింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం జరిగినా చాలా వరకు కేస్ ప్రాపర్టీ, చాలా వరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ సామగ్రి సురక్షితంగానే ఉన్నాయి" అని ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

ఈ ఘటపై కొన్ని మీడియా విభాగాల్లో నిర్ధారణ లేని, ఆధారల్లేని సమాచారాన్ని ప్రసారం చేశాయని ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని... కాబట్టి నిర్ధారణ లేని, ఆధారరహిత వార్తలను ప్రచారం చేయకుండా సంయమనం పాటంచాలని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More