SCR Weekly Express : తెలుగు ప్రయాణికులకు శుభవార్త... చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ రైలు, టైమింగ్స్ ఇవే

SCR Charlapalli Anakapalle Weekly Express : ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి - అనకాపల్లి మధ్య నడిచే ఈ రైలు… టైమింగ్స్, స్టాపింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Apr 25, 2026, 18:27:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SCR Charlapalli Anakapalle Weekly Express : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లికి కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన చర్లపల్లి – అనకాపల్లి – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే బోర్డు ఆమోదించింది. మే మొదటి వారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

చర్లపల్లి - అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్
చర్లపల్లి - అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్

టైమింగ్స్ వివరాలు….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం….. అనకాపల్లి - చర్లపల్లి (నం.17046) రైలు మే 3 నుంచి పట్టాలెక్కుతుంది. అనకాపల్లి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. చర్లపల్లి-అనకాపల్లి (ట్రైన్ నెంబర్.17045) రైలు మే 9 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది.

హాల్ట్ స్టేషన్లు ఇవే….

ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు…. తెలంగాణలోని ప్రధాన పట్టణాలైన జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ఏపీలోని రాయనపాడు (విజయవాడ సమీపంలో), ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుంది.

  • రైలు నెంబర్ 17045: చర్లపల్లిలో శనివారం రాత్రి 20:05 గంటలకు బయలుదేరి… మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 09:25 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది.
  • రైలు నెంబర్ 17046: అనకాపల్లిలో ఆదివారం సాయంత్రం 17:35 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 07:20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ కొత్త రైల్వే సర్వీసు వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు నేరుగా కోస్తాంధ్రకు వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణించే ఉద్యోగులు…. విద్యార్థులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More