...
...
Next Story

నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త - ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్

ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు కానుంది. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. ఈ మేరకు చేనేత జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు.

Published on: Jan 29, 2026 09:44 PM IST
Advertisement

నేతన్నలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 1 నుంచి అమలు - మంత్రి సవిత

ఏపీ సర్కార్ శుభవార్త
ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయనున్నామన్నారు. మగ్గం కలిగిన 93 వేల కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ది కలుగనుందన్నారు. మగ్గం వాడే నేతన్నకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానున్నట్లు తెలిపారు. మర మగ్గం లబ్దిదారులకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.21,600లు ఆర్థికంగా లబ్ధికలుగుతున్నట్లు వెల్లడించారు.

అధికారంలోకి రాగానే 50 ఏళ్ల నిండిన నేతన్నలకు 4 వేల రూపాయల పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇలా రాష్ట్రంలో 87,280 మందికి నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు రూ.1000 చొప్పున్న ఏడాదికి రూ.12 వేల మేర ఆర్థిక లబ్ధి కలుగుతోందన్నారు. గడిచిన రెండు నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామన్నారు. ఈ ఏడాది మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధుల్లో భాగంగా రూ.1.67 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎన్ హెచ్డీసీ ద్వారా నూలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచామని మంత్రి సవిత వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe