రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటిదశలో 55 ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 16 ప్రారంభం కాగా మరో 39 పార్కులకు శంఖుస్థాపన చేశారు.
త్వరితగతిన పూర్తి చేయాలి - సీఎస్ ఆదేశాలు

ఎంఎస్ఎంఇ పార్కు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి… నిర్మాణ పనులపై ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు.
దశలవారీగా ఏర్పాటు…
2వ దశ కింద 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3 ప్రారంభించామని సీఎస్ పేర్కొన్నారు. మరో 42 పార్కులకు శంఖుస్థాపన జరిగిందని అన్నారు. మూడవ దశ కింద ఈనెలాఖరు లోగా 75 ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా 6 పార్కులకు అవసరమైన భూమి ఎపిఐఐసికి అప్పగించినట్లు తెలిపారు. మిగతా వాటికి సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని… ఆప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులను అందుబాటులోకి తెచ్చేలా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశిచాంరు.
విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు-2025లో వివిధ సంస్థలు, కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలకు సంబంధించిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఇటీవల జరిగిన జిల్లా కలక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల అమలుకు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మాట్లాడుతూ జిల్లాల వారీ ఎంఎస్ఎంఇ పార్కుల ప్రగతిని వివరించారు.ఈపార్కులు ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తింపు వేగవంతంగా పనులు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.అన్నిజిల్లాలోను జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్సు ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి ఆసమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
{{/usCountry}}ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మాట్లాడుతూ జిల్లాల వారీ ఎంఎస్ఎంఇ పార్కుల ప్రగతిని వివరించారు.ఈపార్కులు ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తింపు వేగవంతంగా పనులు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.అన్నిజిల్లాలోను జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్సు ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి ఆసమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
{{/usCountry}}