AP Govt Holiday : మిలాద్‌ ఉన్‌ నబీ సెలవు తేదీ మార్పు - ఈనెల 26న సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్

మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. ఆగస్టు 25కి బదులుగా ఆగస్టు 26న ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Published on: Aug 20, 2026, 13:56:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Milad un Nabi holiday 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సెలవుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం.. మునుపు నిర్ణయించిన ఆగస్టు 25వ తేదీకి (మంగళవారం) బదులుగా, ఆగస్టు 26వ తేదీని (బుధవారం) మిలాద్‌-ఉన్‌-నబీ ప్రభుత్వ సెలవు దినంగా ఖరారు చేశారు. నెలవంక దర్శనం ప్రాతిపదికన జరుపుకొనే ఈ పండుగ తేదీ మారడంతో… ముందుగా ప్రకటించిన సెలవు దినాన్ని సవరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

సెలవు మార్పు - కారణాలు…

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 4న జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 25న మిలాద్‌-ఉన్‌-నబీ సాధారణ సెలవుగా పేర్కొంది. అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రబీ ఉల్ అవ్వల్ మాసపు చంద్రదర్శనం ఆగస్టు 12న జరగలేదు. చంద్రుడి గమనం, స్థానిక పరిస్థితుల ఆధారంగా రబీ ఉల్ అవ్వల్ 12వ రోజున వచ్చే మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ ఈసారి ఆగస్టు 26న రానుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

వక్ఫ్ బోర్డు పంపిన ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం…. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొనేందుకు వీలుగా సెలవును ఆగస్టు 26కి మార్చడమే సరైనదని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ, ఈ కొత్త తేదీ మార్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసాధారణ గెజిట్‌లో నోటిఫికేషన్‌ రూపంలో ప్రచురించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకింగ్ సంస్థలకు ఆగస్టు 26న సెలవు వర్తించనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More