బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు
పెట్టుబడులకు ఏపీని మించింది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రావాలని పరిస్థితులు గమనించి పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

చూశాకే నిర్ణయం తీసుకోండి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంథనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్‌లో చర్చించారు.
2026లో డ్రోన్ అంబులెన్స్
రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి సీఎం వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోను డ్రోన్లను ఉపయోగిస్తామని అన్నారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందన్నారు.
బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్
దశాబ్దాలుగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. దావోస్‌కు వచ్చిన ప్రతిసారీ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటానని చెప్పారు. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుస్తున్నామన్నారు. భారతీయులు... అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
'తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయి. ప్రతీ రంగంలో నిర్ధిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కలిసి ఎదుగుదాం... కలిసి పయనిద్దాం... భవిష్యత్‌ని కలిసి నిర్మిద్దాం..' అని ముఖ్యమంత్రి అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


