...
...
Next Story

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!

AP Local Body Elections Schedule 2026 : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల తేదీలను ఇక్కడ చూడండి.

Published on: Oct 14, 2026, 16:22:17 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరశంఖం మోగింది. రాష్ట్రంలో పురపాలక, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెల వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్

మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ గడువు అక్టోబర్ 18 వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 19, ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 21 ఉండగా.. పోలింగ్ అక్టోబర్ 28వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాలు 30వ తేదీన ప్రకటిస్తారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్

రెండో దశ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న వస్తుంది. నామినేషన్ల తుది గడువు 23, నామినేషన్ల ఉపసంహరణ 27 వరకు ఉంటుంది. పోలింగ్ తేదీ నవంబర్ 3 ఉండగా.. ఫలితాలు నవంబర్ 5న వెల్లడిస్తారు.

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

తొలి విడత

నోటిఫికేషన్: నవంబరు 13

నామినేషన్ల గడువు: నవంబరు 17 (ఉపసంహరణ: నవంబరు 21)

నోటిఫికేషన్: నవంబరు 18

నామినేషన్ల గడువు: నవంబరు 20 (ఉపసంహరణ: నవంబరు 24)

పోలింగ్ & లెక్కింపు: నవంబరు 29

మూడో విడత

నోటిఫికేషన్: నవంబరు 19

నామినేషన్ల గడువు: నవంబరు 23 (ఉపసంహరణ: నవంబరు 27)

పోలింగ్ & లెక్కింపు: డిసెంబరు 2

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అవసరమైన భద్రతా చర్యలను సిద్ధం చేస్తున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాల వారీ రిజర్వేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికలు.. 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks